అఘోరాగా బాలకృష్ణ, అవును నిజం…!

-

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుంది. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కి కూడా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర ఎలా ఉంటుంది.అనే దాని మీద ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్చల్ చేసాయి. సింహ, లెజెండ్ రెండు సినిమాలు కూడా వీరి కాంబినేషన్ లో వచ్చి మంచి హిట్ లు కొట్టాయి.

దీనితో ఈ సినిమా కూడా అదే విధంగా పవర్ ఫుల్ గా రూపొందించే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. విలన్ గా సంజయ్ దత్ నటించే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ గుండులో మీసం లుక్ తో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

దీనితో ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర కొత్తగా ఉంటుందని ఆయన భయపెట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం బాలకృష్ణ 15 కేజీల బరువు కూడా తగ్గినట్టు సమాచారం. ఇక వారణాసిలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అక్కడి బ్యాక్ డ్రాప్ తోనే ఈ సినిమా వస్తుందని టాక్. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news