బన్నీ – సుకుమార్ సినిమా కోసం విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు ….!! 

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన అలవైకుంఠపురములో సినిమాతో మొత్తానికి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో బన్నీ నటించిన డీజే, నా పేరు సూర్య సినిమాలు ఆయన ఫ్యాన్స్ ని ఎంతో నిరుత్సాహపరిచాయి. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ గా పేరుగాంచిన సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న బన్నీ, ఆ సినిమా కోసం తన మేకోవర్ లో చేంజెస్ కోసం ఎంతో కష్టపడుతున్నట్లు టాక్.

ఇక ఇటీవల శేషాచలం అడవుల్లో సాగిన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అనంతరం అతి త్వరలో మొదలు కానున్న రెండవ షెడ్యూల్ లో హీరో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన్న కూడా పాల్గొనబోతోందట. ఆమె కూడా ఈ సినిమాలో మంచి మాస్ లుక్ లో కనపడనున్నట్లు టాక్. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్న ఈ సినిమాలో హీరో తో పాటు విలన్ పాత్రకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఉండడంతో, ఈ సినిమాలో విలన్ గా కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిని ఎంపిక చేసింది సినిమా యూనిట్.

 

ఇక ఈ సినిమా కోసం ఆయనకు భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ ముట్టచెప్తున్నట్లు టాక్. అయితే కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి ఈ సినిమాకు గాను మొత్తంగా రూ.7 కోట్ల వరకు రెమ్యునరేషన్ రూపంలో తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని దసరా సందర్భంగా విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి……!!

Read more RELATED
Recommended to you

Latest news