బాల‌య్య స‌ర‌స‌న 27 ఏళ్ల కుర్ర హీరోయిన్‌

యువ‌ర‌త్న నంద‌మూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా సెట్స్ కు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాల‌య్య కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూర‌ల్ అనే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే బాల‌య్య బోయ‌పాటి సినిమాలో జాయిన్ కానున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. బోయపాటి బాలయ్య సరసన హీరోయిన్లను.. ఓ విలన్ ని వెతికే పనిలో బిజీ అయ్యారు.

మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మించే ఈ సినిమాలో బాల‌య్య‌కు ప్ర‌తినాయ‌కుడిగా బాలీవుడ్ సీనియ‌ర్ హీరో సంజ‌య్‌ద‌త్ పేరు విన‌ప‌డుతోంది. ఇక బాల‌య్య – బోయ‌పాటి సినిమాల‌కు సెంటిమెంట్గా ఉండేలా ఇద్ద‌రు హీరోయిన్ల‌ను రంగంలోకి దించుతున్న‌ట్టు తెలుస్తోంది. సింహాలో ఏకంగా న‌య‌న‌తార‌, న‌మిత‌, స్నేహ ఉల్లాల్ హీరోయిన్లు. ఇక లెజెండ్‌లో రాధికా ఆఫ్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లు.

ఇప్పుడు చేసే మూడో సినిమాకు కూడా ఇద్ద‌రు హీరోయిన్ల‌ను సెట్ చేస్తున్నార‌ట‌. ఈ సినిమాలో బాలయ్యకు ఓ హీరోయిన్ గా 27 ఏళ్ల కన్నడ బ్యూటీ రచిత రామ్‌ను దింపుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం బాల‌య్య వ‌య‌స్సు 60 సంవ‌త్స‌రాలు.  ఇద్దరి మధ్య 33 సంవత్సరాలు వయసు తేడా ఉన్నట్లే. బోయ‌పాటి రుచిత రామ్‌ను ఎంపిక చేసి పెద్ద సాహ‌సం చేసిన‌ట్టే. గ‌తంలో స్నేహ ఉల్లాల్ విష‌యంలో ఇలాగే జ‌రిగినా సినిమా చూస్తున్న‌ప్పుడు ఆ ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే సీన్ల‌లో ఎక్క‌డా ఇబ్బంది లేదు.

రచితా రామ్ కన్నడలో బిజీ హీరోయిన్. ప్రస్తుతం ఆరేడు సినిమాలు చేస్తోంది. గ్లామర్  తారగా   అక్కడి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మ‌రి ఇప్పుడు ఆ గ్లామ‌ర్ హీరోయిన్‌ను ఇక్క‌డ బాల‌య్య ప‌క్క‌న పెట్టి బోయ‌పాటి ఎంత గ్లామ‌ర‌సం ఒల‌క‌బోయిస్తాడో ?  వీరిద్ద‌రి మ‌ధ్య ఎంత ఘాటు కెమిస్ట్రీ పండిస్తాడో ?  చూడాలి