నేనే హీరో.. నేనే విల‌న్ అంటున్న బాల‌య్య‌.. అదిరిపోద్దేమో ..?

-

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణకు గ‌త ఏడాది ఓ చేదు అనుభ‌వంగా మిగిలిపోయింది. తండ్రి నంద‌మూరి తార‌క రామారా‌వు గారి జీవితంపై తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్‌తో పాటు భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన రూల‌ర్ సినిమా కూడా బాక్సాఫిస్ వ‌ద్ద బోల్తాప‌డ్డాయి. ప్ర‌స్తుతం బాల‌య్య బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో వీరి కాంబోపై సూప‌ర్ క్రేజ్ పెరిగిపోయింది.

ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాల‌య్య రెండు విభిన్నమైన షేడ్స్ క‌నిపించ‌నున్నాడ‌ని ఇప్ప‌టికే అనేక వార్త‌లు వ‌చ్చాయి. అందులో ఒక పాత్ర అఘోర గెటప్ అన్న సంగ‌తీ తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. అస‌ల ఈ సినిమాలో స్పెషల్ గా విలన్స్ లేరట. అదేంటి విల‌న్ లేకుండా సినిమా తీయ‌డం ఏంటి..? అస‌లు విల‌న్ లేకుండా బోయ‌పాటి సినిమా తీస్తాడా..? అన్న సందేహాలు రావొచ్చు.

విష‌యం ఏంటంటే ఈ సినిమాలో హీరోగానూ మ‌రియు విల‌న్‌గానూ బాల‌య్య‌నే క‌నిపించ‌నున్నాడ‌ట‌. అఘోర పాత్ర పూర్తి నెగటివ్ షేడ్స్ లో ప్రెజంట్ చేస్తారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అయితే ఈ సినిమాలో ఓ స్ట్రాంగ్ లేడీ విలన్ రోల్ భూమిక నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బోయపాటిని ఒప్పించి మరీ బాలయ్య ఈ సినిమాలో విలన్‌ పాత్రకు గాను భూమికను ఎంపిక చేయించినట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news