బాల‌కృష్ణ అంబులెన్స్ ఎందుకు న‌డిపారు?

బాల‌య్య ఏది చేసినా వైర‌లే. ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల్లోనూ య‌మ యాక్టీవ్‌గా వున్న నంద‌మూరి బాల‌కృష్ణ సామాజిక కార్య‌క్ర‌మాల‌తో పాటు బ‌స‌వ‌తార‌కం హాస్పిట‌ల్ కు సంబంధించిన కార్య‌క్ర‌మాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా బ‌స‌వ‌తార‌కం హాస్పిట‌ల్ వ‌ద్ద అంబులెన్స్ న‌డుపుతూ షాకిచ్చారు. ఇంత‌కీ బాల‌య్య అంబులెన్స్ ఎందుకు న‌డిపార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. బంజారా హిల్స్‌లోని బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ వ‌ద్ద అంబులెన్స్ న‌డుపుతూ కెమెరాకు చిక్కారు.

గ‌త కొన్నేళ్లుగా బ‌స‌వ‌తార‌కం హాస్పిట‌ల్ కి డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హాస్పిట‌ల్‌కు అంబులెన్స్‌ని విరాళంగా అందించారు. ఈ సంద‌ర్భంగా బాల‌య్య అంబులెన్స్ ఎక్కి ఓ రౌండ్ వేయ‌డం అక్క‌డున్న వారిని ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. బాల‌య్యా మాజాకా.. న‌చ్చింది చేసేయ‌డం.. ఎవ‌రేమ‌నుకున్నా లైట్ తీసుకోవ‌డం బాల‌య్య స్టైల్‌. బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్నారు.