మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య క్లారిటీ..!

-

నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై కొన్నాళ్లుగా మీడియాలో హడావిడి అందరికి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రాం తర్వాత ఇండస్ట్రీకి ఎవరు పరిచయం కాలేదు. మరోపక్క మెగా ఫ్యామిలీ నుండి వరుసగా హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు. తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై నందమూరి బాలకృష్ణ నోరు విప్పారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అన్నారు. ప్రస్తుతం యాక్టింగ్, డ్యాన్స్, ఫిజిక్ వంటి వాటిలో శిక్షణ తీసుకుంటున్నాడట.

నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ డైరక్టర్ ఎవరు..? ఆ ఛాన్స్ బాలకృష్ణ్ ఎవరికి ఇస్తారంటే ప్రస్తుతం తాను ఎలక్షన్స్, బోయపాటి శ్రీను సినిమా బిజీలో ఉన్నానని ఆ తర్వాత మోక్షజ్ఞ సినిమా గురించి ఆలోచిస్తానని చెప్పారు. వచ్చే ఏడాది మాత్రం మోక్షజ్ఞ సినిమా ఉంటుందని మాత్రం క్లారిటీ ఇచ్చారు బాలకృష్ణ. మరి మోక్షజ్ఞ మొదటి సినిమా ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news