టివి 5 న్యూస్ రీడర్ గా మారిన ఆర్జివి..!

-

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ న్యూస్ ఛానెల్ టివి 5 స్టూడియోలో జర్నలిస్ట్ మూర్తి రాం గోపాల్ వర్మతో ముఖాముఖి జరుపగా ఇంటర్వ్యూ మొదలు పెట్టే ముందు టివి 5 ప్రైం టైం న్యూస్ హెడ్ లైన్స్ వర్మ చేత చదివించాడు మూర్తి. అమితాబ్ బచ్చన్ లాంటి వారిని డైరెక్ట్ చేసిన ఆర్జివిని తాను డైరెక్ట్ చేశానని.. యు మేడ్ మై డే అన్నారు మూర్తి. జీవితంలో మొదటిసారి న్యూస్ చదివానని వర్మ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

ఇక లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ఎవరు ఆపినా ఆగదని.. మార్చి 29న ఎట్టి పరిస్థితుల్లో ఆ సినిమా రిలీజ్ అవుతుందని చెబుతున్నారు. ఎన్.టి.ఆర్ జీవిత అసలు కథ ఇదే అంటూ ఆర్జివి ముందునుండి చెబుతూ వస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ టీజర్, ట్రైలర్స్ కూడా అదేలా ఉన్నాయి. ఓ పక్క ఏపి ఎలక్షన్స్ లో భాగంగా టిడిపి, వైసిపి పోటాపోటీగా ప్రచారం చేస్తుండగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజైతే పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.


Read more RELATED
Recommended to you

Latest news