త‌న‌యుడు మోక్ష‌జ్ఞ‌తో క‌లిసి ఆ ఆల‌యంలో పూజ‌లు చేసిన బాల‌కృష్ణ‌.. అందుకోస‌మేనా..?

484

బాల‌కృష్ణ కుమారుడు మోక్ష‌జ్ఞ ఆన్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడ‌ని ఆయ‌న అభిమానులు ఎప్ప‌టినుంచో చ‌ర్చించుకుంటున్నారు. అయితే తాజాగా జరుగుతున్న ప‌రిణామాల‌ను చూస్తుంటే మోక్ష‌జ్ఞ త్వ‌ర‌లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తార‌ని తెలుస్తోంది.

టాలీవుడ్‌లోని ప‌లువురు అగ్ర హీరోల‌కు చెందిన కుమారులు ఇప్ప‌టికే సినిమాల్లో అరంగేట్రం చేశారు. ఈ క్ర‌మంలో కొంద‌రు హిట్లు సాధించి ఇండ‌స్ట్రీలో దూసుకుపోతుంటే.. మ‌రికొంద‌రిని మాత్రం ఫ్లాపులు వెంటాడుతున్నాయి. అయితే మ‌రోవైపు ప్ర‌ముఖ న‌టుడు, హిందూపుర్ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ మాత్రం త‌న త‌న‌యుడు మోక్ష‌జ్ఞ‌ను ఎప్పుడు సినిమాల్లో ప‌రిచ‌యం చేస్తారా…? అని అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అందుకు ముహూర్తం త్వ‌ర‌లోనే ఖాయ‌మైంద‌ని తెలుస్తోంది.

balakrishna mokshagna pooja in temple

బాల‌కృష్ణ కుమారుడు మోక్ష‌జ్ఞ ఆన్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడ‌ని ఆయ‌న అభిమానులు ఎప్ప‌టినుంచో చ‌ర్చించుకుంటున్నారు. అయితే తాజాగా జరుగుతున్న ప‌రిణామాల‌ను చూస్తుంటే మోక్ష‌జ్ఞ త్వ‌ర‌లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తార‌ని తెలుస్తోంది. తాజాగా బాల‌కృష్ణ త‌న కుమారుడితో క‌లిసి ఓ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డం ఇందుకు బ‌లాన్నిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా పుల్లేటికుర్ర గ్రామంలోని శ్రీ చౌడేశ్వ‌రి స‌మేత రామ‌లింగేశ్వ‌ర స్వామి ఆల‌యంలో బాల‌కృష్ణ త‌న కుమారుడు మోక్ష‌జ్ఞ‌తో క‌లిసి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

అలా ఆల‌యంలో బాల‌కృష్ణ‌, ఆయ‌న త‌న‌యుడు మోక్ష‌జ్ఞ పూజ‌లు చేయ‌డం ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయింది. మోక్ష‌జ్ఞ త్వ‌ర‌లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తార‌ని, అందుక‌నే వారు పూజ‌లు చేశార‌ని స‌మాచారం. కాగా ఈ ఇద్ద‌రూ ఆలయానికి రావ‌డం, పూజ‌లు చేయ‌డం, తిరిగి వెళ్ల‌డం.. అంతా గోప్యంగా జ‌రిగింది. మీడియాను కూడా ఆల‌య ప‌రిస‌రాల్లోకి అనుమ‌తించ‌లేద‌ని తెలిసింది. అయిన‌ప్ప‌టికీ మోక్ష‌జ్ఞ పూజ‌లు చేసి బ‌య‌ట‌కు వ‌స్తున్న ఫొటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి. వాటిని చూసి అంద‌రూ షాక్‌కు గుర‌వుతున్నారు.. మ‌రి త్వ‌ర‌లోనే మోక్ష‌జ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా, లేదా చూడాలి..!