యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ సినిమా చేస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్‌పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సీ కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే బోయపాటితో కలిసి బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయడంలో బోయపాటి బిజీగా వున్నాడు. బాలయ్య బోయపాటి కాంబో అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో వీరి కాంబోలో వచ్చిన లెజెండ్, సింహా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
ఇక వీరి కాంబోలో వచ్చే మూడో సినిమాలో బాలకృష్ణ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. యాక్షన్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా కథను బోయపాటి రెడీ చేశారట.
ఇక ఈ సినిమా హీరోయిన్ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు అవసరం కాగా, ఒక కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ ను అనుకుంటున్నారట. ఇప్పటికే ‘జెర్సీ’.. ‘జోడీ’ సినిమాల ద్వారా శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. జెర్సీ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.