ఏపీ మంత్రులు మళ్ళీ బుక్ … జ‌గ‌న్ తాజా వార్నింగ్ ఎందుకు…!

-

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయింది. ఈ ఐదు నెలల కాలంలో జగన్…పలుమార్లు మంత్రివర్గ సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రజలకు మేలు చేకూరే కొత్త నిర్ణయాలు, పథకాలు తీసుకొచ్చారు. ప్రతి మంత్రివర్గ సమావేశంలో కొత్త పథకాలకు జగన్ ఆమోద ముద్రవేస్తున్నారు. అయితే ఓ వైపు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటూనే జగన్ మంత్రులకు క్లాస్ కూడా తీసుకుంటున్నారు. మొదట్లో జరిగిన కేబినెట్ మీటింగ్‌లో తప్ప…ఇటీవల వరుసగా జరిగిన మూడు సమావేశాల్లో జగన్ మంత్రులకు క్లాస్ తీసుకోవడం కామన్ అయిపోయింది.

వీటిల్లో కొందరు పనితీరు పట్ల జగన్ సంతృప్తి వ్యక్తం చేస్తూనే… మిగతా మంత్రులకు వార్నింగ్ ఇస్తున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. కొందరి మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, వాటికి ఆధారాలు కూడా ఉన్నాయని, ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని, లేదంటే నా చేతే పదవుల నుంచి తప్పించేలా చేసుకోవద్దని కొంచెం గట్టిగా హెచ్చరించారు. ఇక ఈ మంత్రి వర్గ సమావేశం తర్వాత ప్రతి నెల రెండు, నాలుగో బుధవారాల్లో కేబినెట్ మీటింగ్ ఉంటుందని జగన్ చెప్పారు.

ఈ క్రమంలోనే బుధవారం కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే ఈ సమావేశంలో కూడా జగన్ మంత్రులపై ఫైర్ అయినట్లు తెలిసింది. మంత్రులు సచివాలయంలో అందుబాటులో ఉండటం లేదంటూ జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక నుంచి ప్రతి మంగళవారం, బుధవారాల్లో మంత్రులు కచ్చితంగా సచివాలయంలో ఉండాలని ఆయన ఆదేశించారట. మొత్తానికి ఈ సమావేశంలో కూడా మంత్రులు జగన్ చేత క్లాస్ తీసుకున్నారు. ఇప్పటికైనా జగన్ పడుతున్న కష్టానికి మంత్రులు కొంచెం కరెక్ట్ గా నడుచుకుంటే పార్టీకి మంచి జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news