బాలయ్య, ఎన్టీఆర్, త్రివిక్రమ్, టాలివుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్…!

-

టాలివుడ్ లో మల్టీ స్టారర్ హవా మళ్ళీ మొదలయింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది దసరాకి ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దీనితో టాలివుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా ఈ సినిమా ఈ దశాబ్దంలో నిలవనుంది. మెగా, నందమూరి కుటుంబాల మధ్య వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా వసూళ్లు కూడా భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మరో మల్టీ స్టారర్ కి రంగం సిద్దమవుతుంది. నందమూరి మల్టీ స్టారర్ కి అన్ని సిద్దమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది జూన్ లో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని టాలివుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా కథ ఇప్పటికే సిద్దమైందని, త్రివిక్రమ్ మెరుగులు దిద్దే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం.

ఇక తారక్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అవ్వగానే ఈ సినిమా మీద దృష్టి పెట్టె అవకాశం ఉందని, నిర్మాతగా కళ్యాణ్ రామ్ ఉండే అవకాశాలు ఉన్నాయని, బాలకృష్ణ బోయపాటి సినిమా వేసవిలో విడుదల అవుతుంది. ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ తో జాయిన్ అవుతారని అంటున్నారు. ఈ సినిమాను వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించే సూచనలు ఉన్నాయని అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news