NBK107 నుంచి బాలయ్య బర్త్ డే పోస్టర్ రిలీజ్

-

హీరో బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అఖండ సినిమాతో బంపర్‌ విజయాన్ని అందుకున్న బాలయ్య.. ఇప్పుడు.. తెలుగు కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపిచంద్ మలినేనితో నెక్ట్స్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు NBK 107 వర్కింగ్ టైటిల్‌గా ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా, నిన్న ఈ సినిమా టీజర్ విడుదలైంది.

ఈ టీజర్‌ను చూస్తుంటే పక్కా మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా కనిపిస్తోంది. టీజర్ మొత్తంలో మూడు డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగులు బాలయ్య రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయి.

తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్‌ గా ఉంది. బాలయ్య చెప్పిన డైలాగులు.. అదిరి పోయాయి. ఇక తాజాగా.. ఇవాళ బాలయ్య బర్త్‌ డే సందర్భంగా.. పుట్టిన రోజు పోస్టర్‌ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో బాలయ్య వెరీ పవర్‌ ఫుల్‌ యాక్టర్‌ గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌ చూసిన బాలయ్య ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news