‘మస్తీ మస్తీ జిందగీ హే మస్తీ’ అంటూ కుర్రకారు గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం తొలి చిత్రం ‘నేను శైలజ’తోనే ఏర్పరుచుకుంది నటి కీర్తి సురేశ్. ఇక ‘మహానటి’గా తనకు అతి తక్కువ కాలంలోనే గుర్తింపు లభించింది. సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో కీర్తి సురేశ్ ను తప్ప వేరే ఎవరినీ ఊహించుకోలేము అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఇకపోతే ఇటీవల కాలంలో కీర్తి సురేశ్ నటనతోనే కాదు అందంతోనూ ప్రేక్షకులను కవ్విస్తోది. మొదట్లో చబ్బీ గా బొద్దుగా ఉండే ఈ అమ్మడు ఇటీవల కాలంలో బక్క చిక్కి ఇంకా అందంగా కనిపిస్తున్నది. అంతేకాకుండా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ అయిపోయింది కీర్తి.
తన లేటెస్ట్ అప్ డేట్స్ ఎప్పడికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నది. లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఆరంజ్ కలర్ జుబ్బా టైప్ డ్రెస్ ధరించి సముద్రం ఒడ్డున నిలబడి ఉన్న ఫొటోలు షేర్ చేసింది.సదరు డ్రెస్ లో మహానటిని చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. బక్క చిక్కిన కీర్తి సురేశ్ అని అంటున్నారు. ఇంకొందరు నెటిజన్లు ‘బబ్లీ గర్ల్,గుడ్ లుకింగ్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కీర్తి..మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాతో పాటు ఇతర భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల విడుదలైన మహేశ్ ‘సర్కారు వారి పాట’, ‘చిన్ని’ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.
View this post on Instagram