BBB : బాల‌య్య- బన్నీ-బోయ‌పాటి కాంబో.. క్లారిటీ ఇచ్చిన బోయ‌పాటి

-

న‌ట‌సింహం బాల‌కృష్ణ హీరోగా యాక్ష‌న్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల వ‌చ్చిన అఖండ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అయితే తాజాగా బోయాపాటి శ్రీ‌ను మ‌రో సినిమా కు క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడ‌నే వార్త‌లు ఈ మ‌ధ్య చాలా వ‌స్తున్నాయి. బాల‌య్య‌, బ‌న్ని మ‌ల్టీస్టార‌ర్ గా ఈ సినిమా రాబోతుంద‌ని పుకార్లు వినిపించాయి. దీంతో బీబీబీ ( బాల‌య్య – బ‌న్నీ – బోయ‌పాట ) సినిమా త‌ర్వలోనే వ‌స్తుంద‌ని వార్తులు వ‌చ్చాయి. అయితే ఈ బీబీబీ సినిమాపై స్టార్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను క్లారిటీ ఇచ్చాడు.

కాగ బాల‌య్య, బోయ‌పాటి శ్రీ‌ను కాంబో లో వ‌చ్చిన అఖండ హిట్ ను ఈ రోజు సంక్రాంతి సంబురాల పేరిట స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో రిపోర్ట‌ర్లు బీబీబీ సినిమా గురించి అడ‌గ‌గా.. బోయ‌పాటి శ్రీ‌ను కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీబీబీ సినిమా చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెప్పారు. ఎదీ జ‌ర‌గ‌దు అని పోరపాటున కూడా అనుకోవ‌ద్ద‌ని బోయ‌పాటి అన్నారు.

 

ప్ర‌తిదీ జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపారు. బీబీబీ సినిమా ను కూడా చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో త్వ‌ర‌లోనే బీబీబీ సినిమా రానుంద‌నే విష‌యం దాదాపు క‌న్ఫామ్ అయిన‌ట్టే అని నంద‌మూరి, అల్లు అభిమానులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news