అఖిల్ ను ఫాలో అవుతున్న బాలయ్య వారసుడు ” మోక్షజ్ఞ”

ఇండస్ట్రీలో నట వారసులకు కొదవలేదు అని చెప్పవచ్చు.తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది వారసులు హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం అక్కినేని, మెగా, నందమూరి వారసులు హీరోలుగా రాణిస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.అదేంటో కాదు టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి మూడవ తరం హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.బాలయ్య కూడా తన కొడుకు ఎంట్రీ కోసం భారీగా ప్లాన్ వేస్తున్నాను అని అప్పట్లో తాను స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే.మోక్షజ్ఞ కోసం అద్భుతమైన స్క్రిప్ట్ రెడీగా ఉందని ఆదిత్య369 కి సీక్వెల్ గా తెరకెక్కే ఆదిత్య 999 మాక్స్ సినిమా ద్వారా తన కొడుకు ఎంట్రీ చేయబోతున్నారని, 2023 లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నామని బాలయ్య తెలిపారు.అయితే గతంలో తానే తన కొడుకు సినిమాకు దర్శకత్వం వహిస్తారు అని చెప్పిన బాలయ్య కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

హీరోగా లాంచ్ చేయడానికి చేయడానికిముందేముందే తన సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇప్పించారని ఆలోచిస్తున్నారట.మనం సినిమాలో అక్కినేని వారసుడు అఖిల్ క్యామియో ఇచ్చినట్లే అనిల్ రావిపూడి దర్శకత్వం లో తాను నటించే సినిమాతో మోక్షజ్ఞని త్వరలో తీసుకురావాలని ఆలోచిస్తున్నారట బాలయ్య.