బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్..?

-

దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. మృత్యుఘంటికలు మోగిస్తుంది. రోజురోజుకి కేసులతో పాటు మరణాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు, నాయకులు, తారలు, అధికారులు అనే తేడా లేకుండా అందరినీ పలకరిస్తుంది ఈ మహమ్మారి. తాజాగా టాలీవుడ్‌ నిర్మాత బండ్ల గణేష్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని సమాచారం. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈయనకు పాజిటివ్ వచ్చిందని వార్తలు రావడంతో ప్రస్తుతం అంతా కంగారు పడుతున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితంగా ఉన్నవాళ్లు కూడా టెస్టులు చేయించుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news