ట్రెండ్ ఇన్ : బీస్ట్ మూవీ.. విజయ్ సినిమాకు పాన్ ఇండియా వైడ్ క్రేజ్..

-

స్టార్ హీరోల సినిమాలన్నీ ప్రజెంట్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి. ఇది ఇటీవల కాలంలో వచ్చిన ట్రెండ్ కాగా, దీనిని అందరూ ఫాలో అవుతున్నారు. ‘బాహుబలి’ నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఇక కొనసాగుతూ..నే ఉంటుందని చెప్పొచ్చు. కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలై అభిమానులకు ఫీస్ట్ ఇచ్చింది.

ఈ నెల 13న చిత్ర విడుదల కానుంది. కాగా, ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో విజయ్ అభిమానులు చిత్రానికి క్రేజ్ ఇంకా పెంచేందుకు #BeastMovie హ్యాష్ ట్యాగ్‌‌ను మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్ లో విజయ్ స్పై రోల్ ప్లే చేస్తుండగా, ఆయనకు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఇందులో డైరెక్టర్ సెల్వరాఘవన్ నటుడిగా కనిపించి ఆకట్టుకుంటున్నారు.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యాక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ విడుదలైన ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. ఈ ఫిల్మ్ కు అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 5న ఈ చిత్ర తెలుగు ట్రైలర్ విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. హిందీలో ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారే రిలీజ్ చేస్తున్నారు. మొత్తంగా ఇళయ దళపతి విజయ్ కూడా ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news