బ్యూటీ స్పీక్స్ : అందాల తార‌లు అరుదైన తార‌క‌లు ద‌టీజ్ రాజ‌మౌళి

-

గురువు కోవెల‌మూడి రాఘ‌వేంద్ర‌రావు..ఆయ‌న ప్ర‌భావం అస్స‌లు ర‌వ్వంత అయినా లేని ద‌ర్శ‌కులు రాజ‌మౌళి. త‌నేంటో త‌న ప‌నేంటో మాటల్లో కాకుండా..చేత‌ల్లో చెప్పే రాజ‌మౌళి సినిమాల్లో క‌థానాయ‌కి ప్ర‌త్యేకం. కొన్ని సినిమాల్లో ఆమె గ్లామ‌ర్ షోకే ప‌రిమితం. ఇన్నేళ్ల కెరియ‌ర్లో ఆయ‌న పెద్ద‌గా హీరోయిన్ల‌ను రిపీట్ చేయ‌లేదు. స్టూడెంట్ నంబ‌ర్ ఒన్ పాట‌ల‌ను తాను షూట్ చేయ‌లేద‌ని అంటారు. అస‌లు ఆ సినిమా కాద‌ని,తన‌లో ఉండే అప‌రిప‌క్వ‌త‌కు ప‌రాకాష్ట ఆ సినిమా అని ప‌దే ప‌దే ప‌లు ఇంట‌ర్వ్యూలలో చెప్పారు. అంటే ఆ సినిమాలో ఆయ‌న ప్ర‌మేయం చాలా త‌క్కువ.

సినిమాకు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేసిన రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌భావ‌మే సినిమాపై చాలా అంటే చాలా ఎక్కువ. త‌రువాత వ‌చ్చిన సినిమాల‌లో సింహాద్రిలో భూమిక, సై సినిమాలో జెనీలియా, ఛ‌త్ర‌ప‌తిలో శ్రియ, విక్ర‌మార్కుడులో అనుష్క‌, య‌మ‌దొంగ లో ప్రియ‌మ‌ణి, మ‌మ‌తా మోహ‌న్ దాస్ , మ‌గధీర‌లో కాజ‌ల్, మ‌ర్యాద రామ‌న్నలో స‌లోని, ఈగ‌లో స‌మంత, బాహుబ‌లిలో అనుష్క, త‌మన్నా ఇలా ఎవ‌రికి వారే ప్ర‌త్యేకం. వారి సంగ‌తులు ఇవాళ్టి బ్యూటీ స్పీక్స్ లో…

గజాలా :

దర్శకధీరుడి మొదటి సినిమా హీరోయిన్‌. స్టూడెంట్‌నం.1 ఆమెకు లక్కీ. తారక్‌కు లక్కీ, రాజమౌళికి లక్కీ. ఎందుకంటే ఆ సినిమా వీరందరికీ మొదటిది. సినిమా సూపర్‌హిట్‌. ముద్దుమోము, చలాకీ కళ్లు… ఆకట్టుకునే అభినయం….వెరసి గజాలా. ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను క‌ట్టిపడేసింది. ఈ సినిమా విజయం తెలుగులో ఆమె కెరియ‌ర్‌కు చక్కటి పునాది వేసింది.

అంకిత

హాట్‌ అండ్‌ క్యూట్‌లుక్స్‌తో, చీమ…చీమ పాటతో తెలుగులో హిట్‌ కొట్టింది అంకిత. ‘రస్నాబేబీ’ గా తెరకు పరిచితురాలైన అంకిత రాజమౌళి రెండో సినిమా సింహాద్రి హీరోయిన్‌. మరో హీరోయిన్‌ భూమికకు దీటుగా నటించి మంచిపేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి..అలానే హిట్లూ వ‌రించాయి.

శ్రియ

తెలుగు ప్రేక్షకులకు ‘ఇష్టం’తో ప‌రిచ‌యం హీరోయిన్‌ శ్రియాశ‌ర‌ణ్‌. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మది గెలుచుకున్న ఈ హరిద్వార్‌ అందం రాజమౌళి ‘ఛత్రపతి’ సినిమాతో మాసివ్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌లోనూ మెరిసింది.

అనుష్క

 

కర్ణాటకకు చెందిన యోగా టీచర్‌ స్వీటీ అనుష్కగా మారింది. తెలుగులో ‘సూపర్‌’ ఎంట్రీతో అదరగొట్టింది. ఆ స్టైలిష్‌ లుక్స్, స్మైలీ ఫేస్‌తో విక్రమార్కుడు సినిమాలో హీరోయిన్‌ అయ్యింది. రవితేజ సరసన అల్లరిగా, అమాయకంగా నటించి ఆకట్టుకుంది. ఇంక బాహుబలి సినిమా అయితే వేరే లెవల్‌. మ‌త్తెక్కించే కంటి చూపుతో, కట్టిపడేసే అభినయంతో మంత్రముగ్ధులను చేసింది ఈ కన్నడ కస్తూరి. ఈ సినిమా అనుష్కలోని అందాన్ని మాత్రమే కాదు అభినయాన్ని కూడా ఒక రేంజ్‌లో చూపించింది. దేవసేనగా
మెరిసి బాహుబ‌లి విజ‌యంలో కీల‌కమై నిలిచింది.

సలోని

ఈమె కూడా కన్నడం నుంచే తెలుగులోకి అడుగుపెట్టిన న‌టి. మోడల్‌గా పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించిన సలోనిని తన ‘మర్యాదరామన్న’కు హీరోయిన్‌గా సెట్‌ చేశారు జక్కన్న. ఆ సినిమాలో హీరో సునీల్, సలోనిల జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది.
రాయె రాయె రాయె స‌లోనీ పాట పెద్ద హిట్..ఈ పాట‌ను ర‌ఘు కుంచె, గీతామాధురి ఆల‌పించిన తీరు ఇప్ప‌టికీ ఓ హైలెట్.

జెనీలియా

అదిరిపోయే ఎంట్రీ హీరోయిన్‌ జెనీలియా డిసౌజాది. దర్శకడు శంకర్‌ ‘బాయ్స్‌’ సినిమాలో మొదటి చాన్స్‌ దక్కించుకుంది. ఆ తరువాత రాజమౌళి సినిమాకు‘సై’ అంది. చంటైనా…బుజ్జైనా అనే పాటలో జెనీలియా పర్‌ఫార్మెన్స్‌ ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

కాజల్‌

టాలీవుడ్ చందమామ..పంచదారబొమ్మ..కాజల్. అందం, అభినయాల మేలు కలబోత. మగధీర సినిమాలో మిత్రవిందగా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకుంది.

సమంతా

కేరళ బ్యూటీ…వెరీ క్యూటీ సమంత. ఈగ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది, ‘ఏం మాయ చేశావే’ అనేంత చక్కగా నటించింది. ఆ సినిమాతో ఆమె పర్‌ఫార్మెన్స్,కెరీర్‌ మరో మెట్టు ఎక్కాయనడంలో సందేహం లేదు.

తమన్నా

‘శ్రీ’ సినిమాతో శుభంగా తెలుగు సినిమాలో అడుగుపెట్టిందీ సింధీ ముద్దుగుమ్మ. మిల్క్‌బ్యూటీ అని ప్రేక్షకులు ఎంతో ఆరాధనగా పిలుచుకునే తమన్నా భాటియా బాహుబలిలో అవంతికగా అద్భుతంగా నటించింది. గ్లామర్, యాక్టింగ్‌ రెంటినీ బాలన్స్‌ చేసుకుంటూ సినిమాల్లో రాణిస్తోందీ అమ్మడు.

ప్రియమణి

ముద్దుపేరు పిల్లూ మణి…అసలు పేరు ప్రియమణి…మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు కైవసం చేసుకున్న ఈ మల‌యాళ ముద్దుగుమ్మ తెలుగులో ఎంట్రీ విషయ‌మై కాస్త తడబడినా తర్వాత నిలదొక్కుకుంది. యమదొంగ ఎన్టీఆర్‌ సరసన అమాకురాలైన ప్రేమికురాలిగా చక్కగా ఒదిగిపోయింది. ద‌లేర్ మెహందీ పాడిన రబ్బరుగాజులు…పాట ఆమె కెరీర్‌లోనే బెస్ట్ …

అలియాభట్‌

మహేశ్ భ‌ట్ కూతురనే అవకాశం,అభిమానం మొదటి సినిమా వరకే.! ఆ తరువాత తన యాక్టింగ్‌ టాలెంట్‌తో సూపర్‌హిట్స్ అందుకుంది. అందుకే మోస్ట్‌ పాపులర్ డైరెక్టర్‌ రాజమౌళి సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఇన్నేళ్లకు తెలుగు అభిమానుల కల ఫలించి ఆర్‌ఆర్‌ఆర్‌లో సీతగా మెరిసింది.

Read more RELATED
Recommended to you

Latest news