కీర్తి సురేష్ వెనక స్టార్ హీరోలు ..తాజాగా రిలీజైన పెంగ్విన్ ట్రైలర్ ..!

-

“మహానటి” సినిమాతో నేషనల్ అవార్డ్ ను సాధించిన కీర్తి సురేష్ తాజాగా నటించిన సినిమా ‘పెంగ్విన్’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ – ప్యాషన్ స్టూడియోస్ పతాకంపై తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మించారు. కార్తికేయన్ సంతానం – కాల్ రామన్ – ఎస్.సోమసేగర్ – కళ్యాణ్ సుబ్రమణియన్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 19న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది.

 

ఈ నేపథ్యంలో చిత్ర బృందం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్టార్ హీరోయిన్స్ సమంత, త్రిష, తాప్సి, మంజువారీయర్ లు ‘పెంగ్విన్’ టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ జూన్ 8 న రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ని తెలుగులో హీరో నాని.. మలయాళంలో మోహన్ లాల్.. తమిళ్ లో ధనుష్ రిలీజ్ చేయడం విశేషం.

థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ చిత్రానికి కార్తీక్ ఫలని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. తెలుగు తమిళం మలయాళం హిందీ భాషలలో విడుదల కానున్న ఈ సినిమా తో కీర్తి సురేష్ మరో భారీ హిట్ అందుకోబోతుందన్న టాక్ వస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version