1920 కీ కొమరం – అల్లూరి లకీ సంబంధం ఏంటి ?

-

‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక సినిమా RRR. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ టైం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇదిలా ఉండగా ఫస్ట్ టైం సినిమా టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ నీ ఉగాది పండుగ నాడు సినిమా యూనిట్ రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసినదే. రిలీజ్ అయిన పోస్టర్ లోగోలో గమనించదగ్గ విషయం ఏమిటంటే ‘RRR’ టైటిల్ పైన 1920 అని రాసి ఉంది. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది.Title of Rajamouli's 'RRR' announced | The News Minuteఅసలు 1920 సంవత్సరానికి వీళ్ళిద్దరికీ సంబంధం ఏమిటి? 1920లో ఏం చేశారు.? అన్న చర్చ నందమూరి మరియు మెగా అభిమానుల మధ్య గట్టిగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్వాతంత్ర పోరాట నేపథ్యంలో సినిమా కావడంతో అదే టైంలో కొమరం భీం మరియు అల్లూరి సీతారామరాజు లు రంగంలోకి దిగినట్లు కొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా మరికొంత మంది కొమురం భీం మరియు అల్లూరి సీతారామరాజు బతికిన రోజులు చాలా తేడా ఉన్నాయని ఇద్దరు కలిసి పని చేసిన సందర్భాలు లేవని అంటున్నారు.

 

అయితే ఈ విషయాన్ని ముందు సినిమా స్టార్ట్ అయిన తరుణం లో ఒక ఫిక్షన్ కథ తో రాజమౌళి క్లారిటీ ఇచ్చారు అని, దాని అర్థం చేసుకునే సినిమా చూడండి అంటూ కొంతమంది ఫ్యాన్స్ క్లారిటీ ఇస్తున్నారు. ఏదిఏమైనా మోషన్ పోస్టర్ అదేవిధంగా..రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ కి సంబంధించిన వీడియో అదిరిపోయింది అని, చరణ్ బాడీ తో పాటు, ఎన్టీఆర్ బ్యాగ్రౌండ్ మాటలు అదరగొట్టాయి అని అంటున్నారు. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news