సిక్స్ ప్యాక్ తో సర్ ప్రైజ్ చేసిన బెల్లంకొండ

-

బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ సినిమా ఫలితాలు ఎలా ఉన్నా సరే వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నడు. ఈమధ్యనే కవచం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ప్రస్తుతం తేజ డైరక్షన్ లో సీతా సినిమా చేస్తున్న శ్రీనివాస్ ఆ సినిమా తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.

ఈ సినిమా కోసం శ్రీనివాస్ సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. దానికోసం బాగానే వర్క్ అవుట్స్ చేసినట్టున్నాడు బెల్లంకొండ హీరో. ఫైనల్ గా తన సిక్స్ ప్యాక్ లుక్ తో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశాడు. విజయానికి హార్డ్ వర్క్ ఒకటే దారి.. 2019 విజయవంతం అవడం కోసం అంటూ ట్వీట్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. రమేష్ వర్మ సినిమా తర్వాత ఆరెక్స్ 100 అజయ్ భూపతి డైరక్షన్ లో మరో సినిమా లైన్ లో పెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. మరి ఈ సినిమాలతో అయినా బెల్లంకొండ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news