భీమ్లానాయక్ దెబ్బకు సెలవు ప్రకటించిన కొరియా కంపెనీ

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా కొనసాగుతోంది. వకీల్ సాబ్ సూపర్ హిట్ తరువాత పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ కోసం పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు నేటితో తెరపడింది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా నాయక్ సినిమా విడుదలైంది. పవన్ తో పాటు రానా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు సాగర్ కే చంద్ర డైరెక్షన్ వహించగా.. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించాడరు. థమన్ మ్యూజిక్ అందించారు. మళయాళం సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రిమేక్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 

ఇదిలా ఉంటే… భీమ్లా నాయక్ ప్రభావం ఉద్యోగులపై కూడా పడింది. అనంతపురంలోని దక్షిణ కొరియాకు సంబంధించిన ప్రముఖ కార్ల కంపెనీ కియా కూడా సెలవు ప్రకటించింది. కియా కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు భీమ్లా నాయక్ చూసేందుకు మూకుమ్మడిగా సెలవు పెట్టారు. సినిమా చూసేందుకు సెలవు కావాలని యాజమాన్యానికి లేఖ రాశారు. ఉద్యోగుల లేఖతో షాకైన కంపెనీ హెచ్ఆర్ విభాగం వెంటనే ఈరోజు సెలవు ప్రకటించింది. శుక్రవారానికి బదులు ఆదివారం విధుల్లోకి రావాలని ఉద్యోగులను యాజమాన్యం ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news