Bholaa Shankar Teaser : భోళా శంకర్ టీజర్ కు ముహుర్తం ఫిక్స్

-

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు .స్వయంకృషితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమాతో రూ .100 కోట్ల కలెక్షన్లను అందుకున్నారు. చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం బోళా శంకర్.

ఈ చిత్రం తమిళ సినిమా ఆయన వేదాళం సినిమాకి రీమిక్ ను డైరెక్టర్ మెహర్ రమేష్ తెలుగులో రీమేక్ చేస్తూ ఉన్నారు. చిరంజీవి సరసన తమన్నా నటిస్తూ ఉండగా.. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా టీజర్ ను రేపు సాయంత్రం 4 గంటలకు సంధ్య థియేటర్‌ లో రిలీజ్‌ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news