‘బోయపాటి రామ్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..

-

టాలీవుడ్ చాక్లెట్ బాయ్ / ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. డ్యాషింగ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్​కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఓ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటిస్తూ ఓ సూపర్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్​లో.. ఓ పల్లెటూరి వాతావరణంలో మంచంపై పంచెకట్టులో కూర్చున్న రామ్​.. ఇక ఆయన చేతిలో ఓ కాఫీ కప్.. ఇలా పచ్చటి పొలాల మధ్య స్టైలిష్​ లుక్​లో రామ్​ కనిపిస్తున్నారు. ‘వీ ఆర్​ కమింగ్​ ఇన్​ ఎర్లీ'( మేము ముందుగానే వచ్చేస్తున్నాము) అంటూ ఆ పోస్ట్​ను షేర్​ చేసిన మూవీ టీమ్​ అందులో ప్టెంబర్​ 15న సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

అప్పట్లో ఈ సినిమాను అక్టోబర్​ 20న విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఈ సినిమా కోసం దసరా వరకు వేచి చూడాలనుకున్న అభిమానులకు ఈ వార్త తీయ్యటి కబురులా అనిపించింది. అయితే ఇప్పటికీ ఆ పోస్టర్​లో ‘బోయపాటిరాపో’ అనే వర్కింగ్​ టైటిలే ఉంది. ఈ చిత్రానికి టైటిల్ ఏం పెడతారా అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news