Big Boss OTT Telugu: ‘బిగ్ బాస్’లో విశ్వక్ సేన్..ఈ హీరో అక్కడ ఏం చేశాడో తెలుసా?

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ OTT వర్షన్ గేమ్ పదకొండో వారంలోకి ఎంటరయింది. హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ టైటిల్ విన్ అయ్యేందుకుగాను గేమ్ బాగా ఆడుతున్నారు. ఇక గేమ్ లోకి సర్ ప్రైజింగ్ గా యంగ్ హీరో విశ్వక్ సేన్ ఎంట్రీ ఇచ్చేశారు.

ఇటీవల ప్రాంక్ వీడియోలతో వివాదంలో చిక్కుకున్న విశ్వక్ సేన్ ..బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా ‘బిగ్ బాస్’ నిర్వాహకులు విడుదల చేయగా, అది నెట్టింట బాగా వైరలవుతోంది.

సదరు ప్రోమో లో విశ్వక్ సేన్ ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్ తో ఇంటరాక్ట్ అయిన సంగతి ప్రోమోలో మనం చూడొచ్చు. ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ పిక్చర్ హిట్ అయిన తర్వాతనే తాను ‘బిగ్ బాస్’ హౌజ్ కు వచ్చినట్లు విశ్వక్ సేన్ తెలిపాడు.

మ్యారేజ్ తర్వాత వచ్చిన ఇబ్బందులను గురించి కంటెస్టెంట్స్ ను అడిగాడు విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ ప్రశ్నలకు కంటెస్టెంట్స్ ఫన్నీగానే సమాధానమిచ్చారు. ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ హీరోయిన్స్ తో విశ్వక్ సేన్ హ్యాపీగా ‘బిగ్ బాస్’ లో కొంచెం సేపు గడిపాడు.ప్రోమోలో చివరగా ‘తింగ..తింగ..తింగరోళ్ల అటెన్షన్’ సాంగ్ కు కంటెస్టెంట్స్ తో హీరో విశ్వక్ సేన్ చిందేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. హీరో విశ్వక్ సేన్ హౌజ్ లో ఇంకా ఎటువంటి పనులు చేశాడనేది తెలియాలంటే బుధవారం ఎపిసోడ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో చూడాల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news