తీవ్ర నిరాశలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ?

-

అనిరుధ్ రిజెక్ట్.. నిరాశలో పవన్ ఫ్యాన్స్?

 

తెలుగు రాష్ట్రాల్లో ఏ హీరోకు ఎక్కువ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే అందరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నే అని చెబుతారు. ఈ స్టార్ హీరో ప్రస్తుతం రాజకీయాలను, సినిమాలను ఒకే సారి బ్యాలెన్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే క్రిష్ తో హరిహర వీరమల్లు సినిమా చేస్తూన్న పవన్ తాజాగా హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను లాంఛ్ చేశాడు. ఆదివారం పూజా కార్యక్రమాలను కూడా ముగించుకుంది. దీంతో పాటు సాహో దర్శకుడు సుజిత్ తో మరో సినిమాను అనౌన్స్ చేసిన సంగతి విధితమే.

ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ #OG అని ఒక క్యాప్షన్ కూడా ఇటీవల విడుదల చేసిన పోస్టర్ లో ఉంచారు. అయితే ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఘిబ్రాన్ ను తీసుకోబోతున్నారని ముందుగా ప్రచారం సాగింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఘిబ్రాన్ వద్దు.. అనిరుధ్ కావాలి అంటూ సోషల్ మీడియాలో హాల్ చల్ చేశారు.

 

ఇది మూవీ టీం చెవిన పడిందట. దీంతో డైరెక్టర్ సుజిత్ సంగీత దర్శకుడి కోసం తమిళ రాక్ స్టార్ అనిరుధ్ ను సంప్రదించారని టాక్. కానీ సుజిత్, పవర్ స్టార్ ప్రాజెక్ట్ ను అనిరుధ్ రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. అనిరుధ్ ఇప్పటికే కమిట్ అయిన చిత్రాలు, ప్రస్తుతం చేస్తున్న సినిమాల వల్ల బిజీగా ఉన్నాడట. దీంతో పవన్ చిత్రానికి చేయడం కుదరదని చెప్పాడని సమాచారం. దీంతో పవన్ కు భీమ్లా నాయక్, వకీల్ సాబ్ వంటి మ్యూజికల్ హిట్ ఇచ్చిన థమన్ ను ఈ ప్రాజెక్ట్ కు తీసుకునే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ వపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం అనిరుధ్ ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news