బిగ్ అప్డేట్: రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరో..!

-

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తాజాగా ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ కొట్టి రూ. 100 కోట్ల సినిమాలు సాధించాడు. ఆ తర్వాత రవితేజకు మంచి ఆసక్తిగల సినిమాలతో భారీ లైనప్ కుదిరింది. ఇక ఇలాంటి మాస్ మహారాజా సినిమాలో మరో యంగ్ హీరో అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యువ హీరో సిద్దు జొన్నలగడ్డ రవితేజ సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఈయన డీజే టిల్లు కి సీక్వెల్ చేస్తున్నాడు. మరికొన్ని ప్రాజెక్టులు కూడా సిద్దూ చేతిలో ఉన్నాయి. అయితే తాజాగా ఈ ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ, సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కబోతుంది. సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ , సంబరం సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ దశరథ్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ కాంబినేషన్ గురించి మాట్లాడారు.

రవితేజ, సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది.. అది కూడా ఒక రీమేక్ సినిమా.. ఆ సినిమాకు నన్ను దర్శకత్వం వహించమని అడిగారు కానీ ఆ జోనర్ సినిమాలు నాకు చేయాలని లేదు.. దీంతో కేవలం రైటర్ గా మాత్రమే పని చేస్తున్నాను. ఆ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తున్నాను అని తెలిపారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఏ రకమైన కథతో వస్తున్నారో? ఏ సినిమా రీమేక్ ? అని అభిమానుల సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎస్ జె సూర్య , శింబు నటించిన మానాడు సినిమాకు రీమేక్ సినిమాలో వీరిద్దరూ నటించబోతున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news