“గోవాలో 7 రోజులు 6 రాత్రులు”.. మోనాల్ గజ్జర్ అసలు సీక్రెట్ చెప్పేసింది !

-

కరోనా సెకండ్ వేవ్ కారణంగా టాలీవుడ్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. చాలా మంది కార్మికులు సెకండ్ వేవ్ కారణంగా ఉపాధి కోల్పోయారు. అయితే కరోనా సెకండ్ వేవ్… తగ్గుముఖం పట్టడంతో చాలా సినిమాలు షూటింగ్స్ ప్రారంభించాయి. దీంతో చిత్ర పరిశ్రమ ఫుల్ బిజీ అయిపోయింది. సినిమాల అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు క్రేజీ అప్డేట్ బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ (Monal Gajjar) గురించి తెలుసుకుందాం.

మోనాల్ గజ్జర్ | Monal Gajjar

బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్… ఈ పేరు తెలియని వారుండరు. బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మోనాల్ దగ్గరైంది. బిగ్ బాస్ షో తర్వాత… చాలా టీవీ షోలు, వెబ్ సిరీస్ లతో బిజీ అయిపోయింది ఈ గుజరాతి భామ. ఇటీవలే రిలీజ్ అయిన అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించిన మోనాల్ అందరిని అలరించింది. అయితే ఈ గుజరాతి భామ ఇక హైదరాబాది కానుంది. అదేంటి అనుకుంటున్నారా అవును.. ఇది నిజమే.

ఈ ముద్దుగుమ్మ ఇటీవల హైదరాబాదులో ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలోనే తన తల్లితో హైదరాబాద్ లో దిగిపోయింది. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ కూడా చేసింది తాజాగా.” ఇప్పుడు నాకు ఇల్లు దొరికింది. సో నేను కూడా ఆఫీషియల్ గా హైదరాబాద్ నే అయ్యాను. జై శ్రీ కృష్ణ.. గోవిందా.. గోవిందా” అంటూ పోస్ట్ చేసింది.

రెగ్యులర్ షూటింగ్‌లో ‘7 డేస్ 6 నైట్స్’ విషయానికి వస్తే.. గత ఏడాది ‘డర్టీ హరి’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు దర్శకుడుగా వచ్చారు ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు. ఆయన తాజాగా రూపొందిస్తున్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు.

ఈ చిత్రానికి సుమంత్ అశ్విన్ ఎం, రజనీకాంత్ ఎస్ నిర్మాతలు. ఈ నెల 21 (సోమవారం) హైదరాబాద్ లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. జూన్ 21న మొదలైన ఈ షెడ్యూల్ జూలై 10 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఆ తర్వాత 15 నుంచి గోవా, మంగుళూరు, ఉడిపి, అండమాన్ నికోబార్ దీవుల్లో నెలరోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరపడానికి సన్నాహాలు చేశారట.

Read more RELATED
Recommended to you

Latest news