కమ్యూనిస్టులకు కులాలను ఆపాదిస్తే చూస్తూ ఊరుకోం!

-

విజయవాడ: కమ్యూనిస్టులకు కులాలను ఆపాదిస్తే చూస్తూ ఊరుకోమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. మామిడి రైతు సమస్య పరిష్కరించమని నారాయణ అడిగితే కులాన్ని ఆపాదిస్తూ మంత్రులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కులాల పేరుతో బ్లాక్ మెయిల్ మాటలు మానుకోవాలని మండిపడ్డారు. తమకూ ఇంకా ఎక్కువ మాటలు వచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను సమస్యగా మాట్లాడాలని సూచించారు. వైసీపీ వాళ్లకు అధికారం పోతే ఎవరూ పట్టించుకోరని, కానీ ఎవరూ అధికారంలో ఉన్నా తాము మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటామని రామకృష్ణ స్పష్టం చేశారు.

ఇక ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై సీపీఐ నిరసనకు దిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రామకృష్ణ మాట్లాడుతూ ‘‘ఉద్యోగాలు ఉన్నాయని చూపిన జగన్మోహన్ రెడ్డి నేడు మాట తప్పి మడమ తిప్పారు. 30 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆర్ధిక శాఖ చెప్పింది. అన్ని శాఖల్లో ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పితే నిరసనలకు చేయక ఏం చేస్తారు. ఉద్యోగ క్యాలెండర్‌పై వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహిస్తాం. విద్యార్థి ,యువజన సంఘాలకు తమ పూర్తి మద్దతు తెలువుతున్నాం.’’ అని అన్నారు.

రామకృష్ణ ఇంకా మాట్లాడుతూ ‘‘పోలవరం ప్రాజెక్ట్ తాగు సాగు నీరు అందించే ప్రాజెక్ట్ ,విశాఖకు కూడా తాగు నీరు అందించే ప్రాజెక్ట్. నిర్వాసితులు త్యాగం చేయకపోతే ప్రాజెక్ట్ కట్టగలిగే వాళ్లమా?. నిర్వాసితుల్ని ప్రత్యామ్నాయం చూపకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా, దుర్మార్గంగా ఖాళీ చేయమని చెప్పడం దారుణం. 2 ,3 తేదీల్లో పోలవరం ప్రాజెక్ట్ సందర్శిస్తాం నిర్వాసితులను కలుస్తాం. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. తెలంగాణ ,ఆంధ్ర ప్రాజెక్టుల విషయంలో ఒకరినొకరు దూషించుకుంటున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం జగన్ ,కేసీఆర్ గుసాగుస లాడుకుంటారు. వెనుకబడిన ప్రాంతల ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకోవాలి. కేంద్రం జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలి. ’’ అని అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news