బిగ్‌బాస్ 4: ప్ర‌త్య‌క్ష‌మైన నోయెల్‌.. అవినాష్‌.. అమ్మాకు ప‌న్ష్మెంట్‌‌!

బిగ్‌బాస్ సీజ‌న్ 4 శ‌ని‌వారం ఎపిసోడ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. `వైల్డ్ డాగ్‌` షూట్ కోసం మ‌నాలీ వెళ్లిన కింగ్ నాగ్ తిరిగి వ‌చ్చేశారు. స్టేజ్‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఈలోగా అమ్మాయిలు.. అమబ్బాయిలు ఓ టీమ్‌గా ఏర్ప‌డి రెండు టీమ్‌లు కుక్ చేయాలి. అలా కుక్ చేసి ఫుడ్ బాగుందా లేదా అనేది జ‌డ్జ్ చేయాల‌ని అభిజిత్‌, మెహ‌బూబ్‌ల‌కు చెప్పాడు బిగ్‌బాస్ ఈ టాస్క్‌లో అబ్బాయిల టీమ్ గెలిచింది. ఆ త‌రువాత హౌస్‌లో ఈ జ‌ర్నీలో ఎవ‌రు విల‌న్ అన్న‌ది చెప్పి వారికి క్రౌన్ పెట్టాల‌ని టాస్క్ ఇచ్చాడు.

ఈ టాస్క్‌లో అభిజిత్ నుంచి అరియానా వ‌ర‌కు త‌మ‌కు విల‌న్‌లుగా అనిపించిన స‌భ్యుల‌కు క్రౌన్‌ని తొడిగి ఎందుకు విల‌నో వివ‌రించారు. ఈ టాస్క్ పూర్త‌యిన త‌రువాత నోయెల్ స‌డ‌న్‌గా స్టేజ్‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. హెల్త్ కార‌ణాల‌తో మెరెగైన వైద్యం కోసం హౌస్ నుండి బ‌య‌టికి వ‌‌చ్చేసి నోయెల్ స‌డ‌న్ స‌ర్ప్ర‌జ్ ఇవ్వ‌డంతో ఇంటి స‌భ్యులు స‌ర్‌ప్రైజ్ అయ్యారు. త‌ను ఇన్ని రోజులు ఆరోగ్య కార‌ణాల‌తో బాధ‌ప‌డిన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు.

ఈ క్ర‌మంలో ఇంటి స‌భ్యులు మ‌ళ్ల నోయెల్ హౌస్‌లోకి వ‌స్తాడ‌ని భావించారు. కానీ త‌ను హౌస్‌లోకి రావ‌డం లేద‌ని, అయినా త‌ను ప్రేమించి అభిజిత్‌, హారిక‌, లాస్య‌ల‌ని స‌పోర్ట్ చేస్తాన‌ని, త‌ను బ‌య‌ట వున్న అభికి కుడి భుజంలా నిచేస్తాన‌ని స్టేజ్ సాక్షిగా చెప్పేశాడు. ఇక హౌస్‌లో త‌ను లెగ్స్ పెయిన్ కార‌ణంగా బాధ‌ప‌డుతుంటే అమ్మా రాజ‌శేఖ‌ర్, అవినాష్ కామెడీ చేశార‌ని ఇద్ద‌రికి క్లాస్ పీకాడు. మాస్ట‌ర్ పిచ్చా మీకు నేను స్పాండిలైటీస్ పెయిన్‌తో బాధ‌ప‌డుతుంటే మీరు కామెడీ చేస్తారేంటీ.. క‌మెడియ‌నా మీరు అని త‌ను మాట్లేడే వ‌రకు ఒంటి కాలిపై నిల‌బ‌డండ‌ని ప‌నిష్మెంట్ ఇచ్చాడు. అవినాష్ కూడా చిల్ల‌ర కామెడీ చేస్తున్నాడ‌ని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. దీంతో నోయెల్ పై అవినాష్ సీరియ‌స్ అయ్యాడు. చిల్ల‌ర కామెడీ ఏంట‌ని నాగ్ ప‌క్క‌నే వేన్నా ప‌ట్టించుకోకుండా అరిచేశాడు. ఆ త‌రువాత సారీ చెప్పాడు. దీంతో శ‌నివారం ఎపిసోడ్ ఒక్క‌సారిగా హీటెక్కింది.

నామినేష‌న్‌లో వున్న స‌భ్యులు అమ్మ రాజ‌శేఖ‌ర్‌, అరియానా, లాస్య‌, మెహ‌బూబ్‌, అఖిల్‌, మోనాల్‌ల‌లో ముందు ఏడుపు ఆపే బొమ్మ టాస్క్ కార‌ణంగా అఖిల్ సేఫ్ అయ్యాడు. ఆ త‌రువాత నోయెల్ వెళ్లిపోతూ లాస్య‌ని సేఫ్ చేసి వెళ్లిపోయాడు. మొత్తానికి హాఫ్ సెంచ‌రీ దాటేసిన బిగ్‌బాస్ జ‌ర్నీ శ‌నివారం ఎపిసోడ్‌తో ఇక పై స‌ర‌వ‌త్త‌ర మలుపుతు తిరగ‌డం ఖాయంగా క‌ని‌పిస్తోంది.