న‌వ్వేస్తే టైటిల్ ఇస్తాడా బిగ్‌బాస్‌.. వాడండ‌య్యా

-

ఏమ‌య్యా బిగ్‌బాసు హ్యాపీనా.. నిన్న‌టి నుండి ర‌స‌కందాయంలో ప‌డ్డ‌ట్టుంది కాదా.. అభిజిత్‌, అఖిల్ వార్ హైలెట్‌లే.. అబ్బ‌బ్బ‌బ్బ‌.. మోనాల్ కోసం అఖిల్‌, అభిజిత్ కోసం హారిక అబ్బో సీన్లు బాగా పండాయ్ పో..

మ‌రి ఈ సారి ఎవ‌ర్ని ఇంటికి పంపేద్దామ‌నుకుంటాన్నావో నాకు తెలిసిపోయిందిలే.. అంటే నాకు ఓ రెండు లెక్క‌లున్న‌య్‌.. ఒక లెక్క ప్ర‌కారం ఒక ప్రేమ జంట‌ను విడ‌దీయాలి రెండోది మేల్ కంటెస్టంట్ని ఎలిమినేట్ చెయ్యాలి.. ఇదే క‌దా ఆలోచ‌న..?

ప్రేమ జంట అంటే మోనాల్‌, అఖిల్‌, అభిజిత్ ట్ర‌యాంగిల్ ని నువ్వెలాగూ ట‌చ్ చెయ్య‌వు కానీ.. కొత్త‌గా కామెడియ‌న్స్ ల‌వ్ స్టోరీ ట్రై చేశావ్‌గా ఆఆఆ.. అదే అవినాశ్‌, అరియానా జంట నిజంగానే బ్ర‌హ్మానందం, కోవే స‌ర‌ళ లెవ‌ల్లో సెట్ చేశావ్.. అవినాశ్‌ని ఇంటికి పంపించ‌వు ఎలాగూ.. ఇక నీ ఆప్ష‌న్ అరియానానే అనుకుంటున్నా..

ఇక రెండో క‌థ ఏంటంటే.. గ‌త మూడు వారాల నుండి లేడీస్ నే ఇంటికిపంపుతున్నావ్ అనే విమ‌ర్శ రాకూడ‌దంటే పురుష్ ని ఇంటికి పంపించాలి.. ఈ ఆప్ష‌న్ కొంచెం క‌ష్ట‌మే కానీ ట్రై చేస్తావో లేదో మ‌రి.

ఇక ఆట‌లో అర‌టిపండులా హౌస్‌లో ఏం జ‌రుగుతుందో తెలిసీ, తెలియ‌క క‌న్ఫ్యూజ‌న్ పాత్ర‌లో లాస్య కామెడీ పండించ‌లేక‌పోతుంది గురు.. లాస్య స్టార్ మ‌హిళ‌, గృహిణి టైప్‌లో హోమ్‌మేక‌ర్ పాత్ర పోషిస్తుంది. ఆక‌ట్టుకుంటుందా లేదా అనేది నీకే వ‌దిలేస్తున్నా బ్రో.

మ‌రో తెలుగు కంటెస్టంట్ సుజాత.. ఎందుకు న‌వ్వుతుంది అంటూ అంద‌రూ అడుగుతున్నారు. గ‌త సీజ‌న్‌లో సావిత్రి ఏడిస్తే ఏడ్చేస్తుంది బాబోయ్ అన్నారు. ఈ సీజ‌న్‌లో న‌వ్వుతుంది బాబోయ్ అని తెగ ఇదైపోతున్నారు. సుజాత‌ది ఫేక్ న‌వ్వు.. న‌టిస్తుందంటూ ఓఓఓ తెగ ఇదైపోతున్నారు. నిజానికి ఎవ‌రైనా ఎన్నిరోజులు న‌టించ‌గ‌ల‌రు?? ఎన్నిరోజులు ఫేక్‌గా ఉండ‌గ‌ల‌రు.. దేవీ నాగ‌వ‌ళ్లి చెప్పిన‌ట్లు బిగ్‌బాస్ హౌస్‌లో ఫేక్ చెయ్య‌డం క‌ష్టం. సుజాత ఫేక్‌గా న‌వ్వుతుందా అంటే లేద‌ని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవ‌రైనా కానీ ఒక ఎమోష‌న్‌ని కంట్రోల్‌లో పెట్టుకుని ఎన్నిరోజులు ఉండ‌గ‌ల‌రు. ఒక రోజు, ప‌ది రోజులు, నెల రోజులు.?? నిజంగా ఉండ‌గ‌ల‌రా..?? చాలా క‌ష్టం.. సో సుజాత జెన్యూన్ అనిపిస్తుంది బిగ్‌బాసు.. నువ్వూ అలాగే ఫిక్స్ అవ్వు చెప్తా..

కానీ ఈ హౌస్‌లో సేఫ్ గేమ్ ఆడొచ్చు, ఎత్తుల‌కు పై ఎత్తులు వెయ్యోచ్చు, గేమ్ గేమ్‌లాగా ఆడొచ్చు… కానీ ఎవ్వ‌రూ ఫేక్ చెయ్య‌లేరు.. అంతేగా బాసు.. ఇన్ని కెమెరాలు.. 16 మంది కంటెస్టంట్స్‌… క‌ష్ట‌మేగా.. బిగ్‌బాస్‌ను ప‌లుచ‌న‌చేసే పిచ్చి పుల్ల‌య్య‌ల‌కు చెప్పు న‌వ్వినంత మాత్రాన టెటిల్ ఇవ్వ‌న‌ని.. కొంచెం మైండ్ వాడ‌మ‌ని.. వాకే నా..

మీ మా లోకం

Read more RELATED
Recommended to you

Latest news