బిగ్ బాస్ ఎలిమినేషన్.. అందరూ ఊహించిందే జరిగింది…

బిగ్ బాస్ నాలుగవ సీజన్ మొదలై మొదటి ఎలిమినేషన్ దాకా వచ్చింది. ఈ సారి నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు ఉండగా, శనివారం ముగ్గురు సేఫ్ జోన్ లోకి వెళ్ళారు. మిగతా నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. అయితే అందరూ అనుకున్నట్టుగానే డైరెక్టర్ సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ కి దివి, సూర్యకిరణ్ పోటీ పడగా, చివరగా సూర్యకిరణ్ హౌస్ నుండి బయటకు వచ్చేసాడు.

సూర్యకిరణ్ హౌస్ లోకి వచ్చినప్పటి నుండి అందరిమీదా పెత్తనం చెలాయించాలని చూసాడన్న కారణంగానే తక్కువ ఓట్లు పడి ఉంటాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొదటి రెండు మూడు రోజుల్లోనే ఆయన ప్రవర్తన డిఫరెంట్ గా కనిపించడంతో బిగ్ బాస్ అభిమానుల్లో ఒకరకమైన అసంతృప్తి నెలకొందని, అందువల్లే అందరికంటే తక్కువ ఓట్లు పడి, సీజన్ 4 మొదటి ఎలిమినేషన్ గా వెళ్ళాల్సి వచ్చిందని అంటున్నారు.