బిగ్ బాస్: ఎంత ట్రై చేసినా నేను నీకు పడను.. ఆరియానా కౌంటర్..

ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఆరియానా, అవినాష్ ల మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. వీరిద్దరూ ఒకే కలర్ డ్రెస్ వేసుకోవడంతో మెహబూబ్ తో పాటు మరొకరు కూడా ఆరియానా పింక్ డ్రెస్ వేసుకుందనే నువ్వు కూడా అదే రంగు షర్టు వేసుకున్నావా అని అడిగాడు. ఆ టైమ్ లో ఆరియానా, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నేను పడనంటూ అవినాష్ కి షాకిచ్చింది. ఆ మాటకి అవినాష్, నేను నిన్ను ట్రై చేయడమేంటి, అదెప్పుడూ జరగదంటూ రివర్స్ లో కౌంటర్ ఇచ్చాడు.

వీరిద్దరి మధ్య ఇలాంటి చిన్నపాటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అదంతా అటుంచితే, ఈ రోజు హౌస్ లో నవ్వడాన్ని నిషేధించారు. ఎవరెన్ని జోకులేసినా, బిగ్ బాసే స్వయంగా నవ్వించినా నవ్వకూడదని రూల్ పెట్టారు. ఐతే ఈ టాస్కులో కంటెస్టెంట్స్ ఫెయిల్ అయ్యారు. కానీ ఆ ఫెయిల్యూర్ లో మంచి కామెడీ జెనరేట్ అయ్యింది. దాంతో కంటెస్టెంట్స్ అందరికీ వారి వారి ఆత్మీయుల నుండి బహుమతులు లభించాయి.

బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు దీపావళి పండగ జరుపుకున్నారు. టపాసులు లేకుండా దీపాలని వెలిగించి ఆటలాడుతూ ఆనందంగా పండగ సంబరం జరిగింది. గులాబ్ జామున్ స్వీటు ఆరగిస్తూ అందరూ చాలా చక్కగా జరుపుకున్నారు. మొత్తానికి ఈ రోజంతా హౌస్ మొత్తం పండగ వాతావరణంతో కళకళలాడింది. ఈ పండగ సమయాన్ని అఖిల్ ఒక్కడే మిస్సయ్యాడు. సీక్రెట్ రూంలో ఉండడం వల్ల టీవీ చూస్తున్న ప్రేక్షకుడిలాగా వాళ్ళ సంబరాన్ని చూస్తుండిపోయాడు.