రాష్ట్రాలకు బీజేపీ కొత్త ఇంచార్జ్ లు.. ఏయే రాష్ట్రానికి ఎవరంటే ?

వివిధ రాష్ట్రాలకు బీజేపీ కొత్తగా ఇంచార్జిలను నియమించింది. ముందుగా మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇంచార్జిగా మురళీధరన్ ని నియమించారు. సహ-ఇంచార్జిగా సునీల్ దేవధర్ కొనసాగించనున్నారు. ఇక మురళీధరన్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతానికి విదేశాంగ శాఖ మినిస్టర్ ఆఫ్ స్టేట్ గా ఉన్నారు. కేరళకు చెందిన ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.

ఇక తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా తరుణ్ చుగ్ నియమితులు అయ్యారు. ఈయన పంజాబ్ కు చెందిన నేత. ఇక జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌కు అండమాన్-నికోబార్, ఉత్తర్‌‌ ప్రదేశ్ సహా ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి డి. పురందేశ్వరికి చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు. మురళీధర్ రావుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. పొంగులేటి సుధాకర్ రెడ్డికి తమిళనాడు సహ-ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. డీకే అరుణకు కర్నాటక సహా ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించారు.