ఈ రోజు బిగ్ బాస్ ఎపిసొడ్ లో పల్లెకు పోదా ఛలో ఛలో అనే టాస్కు పూర్తయ్యింది. ఈ టాస్కులో అందరూ చాలా చక్కగా పర్ ఫార్మ్ చేసారు. హారిక తనకిచ్చిన సీక్రెట్ టాస్కుని అవినాష్ కి కోపం తెప్పించడం, అమ్మగారిపై కాఫీ పోయడం ద్వారా కంప్లీట్ చేసింది. ఊరి పెద్దగా సోహైల్ ఆకట్టుకున్నాడు. పంచాయతీలో అవినాష్, ఆరియానా ల మధ్య కామెడీ అదిరిపోయింది. మొత్తానికి అందరూ పల్లెటూరికి వచ్చినట్టుగా అనిపించింది.
ఈ టాస్కు తర్వాత బిగ్ బాస్ మరో టాస్కుని ఇచ్చాడు. తమ జీవితంలో వెలుగులు నింపిన సంఘటన గురించి చెప్పమనగా లాస్య చాలా ఎమోషనల్ అయ్యింది. నిజానికి లాస్యకి 2010లోనే పెళ్ళయ్యిందట. ఆ తర్వాత 2012 నుండి తన భర్తతో కలిసి ఉంటుందట. తనకి పెళ్ళయిన విషయం ఎవ్వరికీ తెలియదట. ఆ టైమ్ లో తను గర్భం దాల్చిందట. ఇంట్లో నుండి బయటకి వచ్చేసి భర్తతో ఉంటున్న లాస్యకి అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదట. రెండు రోజులు ఆలోచించి, ఇక చేసేదేమీ లేక అబార్షన్ చేయించుకుందట.
ఆ తర్వాత 2017లో ఇరుకుటుంబ సభ్యుల అంగీకారం మేరకు పెళ్ళి జరిగిందట. అప్పుడు తను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యిందట. కానీ ఆ బిడ్డ గర్భంలోనే చనిపోయిందని చెప్పుకొచ్చింది. ఇద్దరు పిల్లలు భూమి మీదకి రాకుండా అయినందుకు చాలా బాధపడి, డిప్రెషన్ లోకి వెళ్ళానని, ఒక దశలో తనకి పిల్లలు కాలేరేమో అనుకున్నానని చెప్పింది.
కానీ 2018లో తనకి పాప పుట్టిందని, తన ముద్దు పేరు జున్నూ అనీ, తనని చాలా బాగా చూసుకుంటున్నానని చెప్పింది. లాస్య మాటలకి హౌస్ మొత్తం అందరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ప్రతీ ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు.