బిగ్‌బాస్ 4: ప‌్రాణస్నేహితుల్లో ఒక‌రు ఔట్‌?

ఫేక్ ఎలిమినేష‌న్ తో మ‌ళ్లీ అఖిల్ హౌస్‌లోకి వ‌చ్చేశాడు. దీంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రు? .. హౌస్‌లోంచి బ‌య‌టికి వెళ్లేది ఎవ‌రు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఎలిమినేష‌న్‌లో వున్న అభిజిత్ సేఫ్ కావ‌డంతో మిగిలిన వాళ్ల‌లో ఎవ‌రు సేఫ్ అవుతారు.. ఎవ‌రు ఇంటిదారి ప‌డ‌తార‌న్న‌ది ఆదివారం రాత్రి తేల‌బోతోంది.

ఎలిమినేష‌న్‌లో అభిని మిన‌హాయిస్తే మోనాల్‌, మోహ‌బూబ్‌, సోహైల్‌, హారిక, అరియానాలు వున్నారు. ఈ క్ర‌మంలో ఆదివారం ఇంటి స‌భ్యుల‌తో నాగార్జున గ‌ద్ద‌.. కుందేలు గేమ్ ఆడించారు. ఈ టాస్క్ త‌రువాత నామినేష‌న్ రౌండ్‌లో చివ‌రికి ఇద్ద‌రు మిగిలార‌ని ప్రోమోలో క‌నిపిస్తోంది. ఆ ఇద్ద‌రే ప్రాణ‌స్నేహితులు సోహైల్‌.. మెహ‌బూబ్‌. ఈ ఇద్ద‌రిలో ఒక్క‌రు మాత్ర‌మే సేఫ్ అవుతార‌ని చివ‌రికి లైట్ గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో సోహైల్ గెల‌వ‌డంతో మెహ‌బూబ్ ఎలిమినేట్ అయ్యాడు.

దీంతో షో ప్రారంభానికి ముందు నుంచి మెహ‌బూబ్ అంటే అమితాభిమానాన్ని, ప్రేమ‌నీ కురిపిస్తున్న సోహైల్ భావోద్వేగానికి లోన‌య్యాడు. తాజా ప్రోమోని చూస్తుంటే ఈ రోజు మెహ‌బూబ్ ఇంటి నుంచి బ‌య‌టికి రాబోతున్నాడ‌ని క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతోంది.