బిగ్ బాస్: ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చిన సోహైల్.. మోనాల్ కి దెబ్బ పడనుందా..?

-

బిగ్ బాస్ రియాలిటీ షో పూర్తవడానికి మరో వారం మాత్రమే ఉంది. ఫైనల్ కి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ హౌస్ మేట్స్ లో టెన్షన్ పెరుగుతూ వస్తుంది. ఫైనల్ లో ఉండే ఐదుగురు ఎవరనేది సస్పెన్స్ గా మారిన నేపథ్యంలో హౌస్ లో నుండి బయటకి వెళ్లేది ఎవరనేది ఆసక్తిగా మారింది. ఈ రోజు ఎపిసోడ్ లో వ్యాఖ్యాతగా వచ్చిన నాగార్జున, సోహైల్, ఆరియానాల మధ్య జరిగిన ఇష్యూని క్లారిఫై చేసారు.

ఉమెన్ కార్డు వాడడం ఆరియానాది తప్పయితే, ఊరికే కోప్పడడం సోహైల్ ది తప్పని చెప్పాడు. అంతకంటే ముందు హౌస్ మేట్స్ పై ఒక్కొక్కరిపై ఒక్కొక్కరికిగల అభిప్రాయాలని చెప్పమని చెప్పగా, హౌస్ లో ఎక్కువ మంది ఆరియానాకి వ్యతిరేకంగా కనిపించారు. దాంతో ఆరియానా కాస్త డల్ గా కనిపించింది. ఆ తర్వాత హౌస్ లో టాప్ 5లో ఉండేవాళ్ళ పేర్లని చెబుతానని చెప్పిన నాగార్జున, అఖిల్ చేత ఆ లిస్టు రివీల్ చేయించే ప్రయత్నం చేసాడు.

మొదటగాసోహైల్, టాప్ 5లోకి ఎంటర్ అయ్యాడు. దాంతో సోహైల్ సంతోషంతో పొంగిపోయాడు. అదలా ఉంటే, తాజా సమాచారం ప్రకారం హౌస్ నుండి బయటకు వెళ్ళిపోయేది మోనాల్ అని అంటున్నారు. ఎన్నో రోజుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న మోనాల్, ఈ సారి ఎలిమినేట్ అవనుందని చెప్పుకుంటున్నారు. మరి అందరూ అనుకుంటున్నట్టుగా మోనాల్ ఎలిమినేట్ అవుతుందా లేదా ఫైనల్ కి వెళ్ళి అందరికీ షాకిస్తుందా అనేది చూడాలి.

మరి అఖిల్, సోహైల్ తో పాటు ఫైనల్ చేరుకునే అవకాశం ఎవరికి దక్కనుందో..? వారందరిలోకి బిగ్ బాస్ గెలిచే అదృష్టం ఎవరికి ఉందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news