హేమ… ఫ్యామిలీ, హాస్య పాత్రలకు సరిగ్గా నప్పే వ్యక్తి. అందుకే ఆమెకు తెలుగు ఇండస్ట్రీలో అంత డిమాండ్. ఆమె నటనకు ఎటువంటి డోకా లేదనుకోండి.నిజానికి ఆమె గురించి చాలా విషయాలు ఎవ్వరికీ తెలియదు. అంటే ఆమె ఫ్యామిలీ, పిల్లలు.. సినిమాల్లోకి రావడం లాంటి విషయాలు సినీ అభిమానలకు తెలియదు. అయితే ఆమె తాజాగా బిగ్ బాస్ 3 షోలో కంటెస్టంట్ గా వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా ఆమె గురించి, ఆమె ఫ్యామిలీ గురించి మనకు తెలియని విషయాలను తెలుసుకుందాం పదండి.
హేమది ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజోలు. కృష్ణ, లక్ష్మి దంపతులకు ఆమె జన్మించింది.
ఆమె అసలు పేరు హేమ కాదు. కృష్ణ వేణి. డిగ్రీ వరకు చదివిన హేమ.. మద్రాస్ లో డాన్స్ నేర్చుకుంది.తర్వాత తమిళ్ మూవీ హీర మనారోజా అనే సినిమాలో మొదటి సారి నటించింది.తర్వాత 1989 లో భలే దొంగ అనే తెలుగు సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా తెలుగులో 200 పైగా సినిమాల్లో నటించింది.ఇక హేమ భర్త పేరు సయ్యిద్ జాన్ అహ్మద్. వీళ్లకు ఒక కూతురు ఉంది. పేరు ఈషా.హేమ రాజకీయాల్లోనూ ప్రవేశించింది.
2014 లో సమైఖ్యాంధ్ర పార్టీ తరుపున మండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసింది కానీ ఓడిపోయింది. తర్వాత వైఎస్సార్సీపీ పార్టీలో చేరింది కానీ ఆమె ఎక్కడి నుంచి కూడా పోటీ చేయలేదు.ఇది క్లుప్తంగా హేమ గురించి. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి హేమ ఎంట్రీ ఇచ్చింది. ఈసందర్భంగా ఆమెకు మనం బెస్ట్ ఆఫ్ లక్ అని చెబుదాం.