బిగ్ బాస్ అభిమానులకు శుభవార్త.. త్వరలోనే షో ప్రారంభం.. డేట్ ఎప్పుడంటే?

-

బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడూ స్టార్ట్ అవుతుందా అని బిగ్ బాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కంటెస్టెంట్లుగా ఎవరు సెలెక్ట్ అయ్యారా? అని తెగ టెన్షన్ పడుతున్నారు. సోషల్ మీడియాలో కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఓ లిస్టు వైరల్ గా మారుతున్నప్పటికీ.. దాన్ని పూర్తిగా నమ్మలేం.

తెలుగు తొలిసారిగా వచ్చిన రియాలిటీ షో బిగ్ బాస్. హిందీలో ఈ షో ఎప్పుడో ప్రారంభం అయినా రీజనల్ భాషల్లోకి ఇప్పుడిప్పుడే వస్తోంది. తెలుగులో రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. మూడో సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే హోస్ట్, కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తయిందట. హోస్ట్ ఎవరో కూడా మీకు తెలుసు. కింగ్ నాగార్జునే మూడో సీజన్ హోస్ట్. ఇప్పటికే సీజన్ 3 కి సంబంధించిన ఫస్ట్ లుక్, ప్రోమో కూడా విడుదలయ్యాయి.

దీంతో షో ఎప్పుడెప్పుడూ స్టార్ట్ అవుతుందా అని బిగ్ బాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కంటెస్టెంట్లుగా ఎవరు సెలెక్ట్ అయ్యారా? అని తెగ టెన్షన్ పడుతున్నారు. సోషల్ మీడియాలో కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఓ లిస్టు వైరల్ గా మారుతున్నప్పటికీ.. దాన్ని పూర్తిగా నమ్మలేం.

అయితే.. తాజాగా బిగ్ బాస్ సీజన్ 3 కి సంబందించిన ఓ వార్త బయటికి వచ్చింది. మూడో సీజన్ జులై 21న ప్రారంభం కానుందట. అవును.. స్టార్ మా టీవీ యాజమాన్యం.. షోను జులై 21 నుంచి ప్రారంభం చేస్తున్నట్లు వెల్లడించింది. అంటే.. బిగ్ బాస్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్.. జులై 21న ప్రారంభం అవుతుంది. ఆరోజే కంటెస్టెంట్లు ఎవరనేది తెలుస్తుంది. అంటే ఇంకా 23 రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news