ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో `సాహో` ఒకటి. మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఆ స్థానం సాహోదే. ఈ రెండు చిత్రాలకంటే ముందుగా సాహోనే సమరానికి సిద్దమవుతోంది. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం విఎఫ్ ఎక్స్..నిర్మాణానంత పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. అందుకు తగ్గట్టు పనులన్నీ చకచకా పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే చాప్టర్ ఆఫ్ సాహో పేరిటిన రెండు టీజర్లను, మేకింగ్ వీడియోలను రిలీజ్ చేసి సినిమాపై అమాంతం హైప్ పెంచారు. అంతకు ముందు ప్రీ రిలీజ్ టీజర్ తోనే హీటెక్కించారు. దీంతో అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి.
టీజర్లే ఈ రేంజ్ లో ఉంటే? ట్రైలర్ ఇంకే రేంజ్ లో ఉంటుందంటూ అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి. ఆ సమయం కూడా ఆసన్నమైంది. రిలీజ్ కు ఇంకా 40 రోజులకు పైగా సమయం ఉండటంతో ఒక్కోక్కటిగా మార్కెట్ లోకి తీసుకు రావడానికి యూనిట్ రెడీ అవుతోంది. దీనిలో భాగంగా ముందుగా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. అతి త్వరలోనే అదరగొట్టే సాహో ట్రైలర్ రాబోతుందంటూ యూకే సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సందు వెల్లడించారు. ట్రైలర్ చూసి తన ఫీడ్ బ్యాక్ కూడా ఇచ్చారు. ట్రైలర్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందని, అభిమానుల అంచనాలను మించి ఉంటుందని హింట్ ఇచ్చారు. హై ఓల్టేజ్ యాక్షన్ ని యంగ్ డైరెక్టర్ పీక్స్ లో చూపించాడని ఆకాశానికి ఎత్తేసారు.
ఈ నేపథ్యంలోనే దర్శక, నిర్మాతలు ట్రైలర్ రిలీజ్ కు సరైన తేదీ కోసం వెయిట్ చేస్తున్నట్లు రివీల్ చేసారు. ఉమైర్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను ఓ రేంజ్ లో ఊపేస్తున్నాయి. అభిమానులు అడ్వాన్స్ గానే ప్రభాస్ శుభాకాంక్షలు చెప్పడం మొదలు పెట్టారు. అయితే ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. గతంలో ఉమైర్ సందు చాలా సినిమాలకు ప్రీ రివ్యూలు ఇచ్చారు. కానీ ఆ చిత్రాల ఫలితాలు బాక్సాఫీస్ వద్ద వేరుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమైన రివ్యూపై కొంత మంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ట్రైలర్ వచ్చిన తర్వాత…ఉ మైర్ జడ్జిమెంట్ ఎంత వరకూ రైటో.