Bigg Boss 5 Telugu: దశ మారింది.. మెగా ఆఫ‌ర్ కొట్టేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్! ఆ ల‌క్కీ కంటెస్టెంట్స్ ఎవ‌రంటే?

-

Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంతో అమితంగా ఆక‌ట్టుకుంటున్న షో బిగ్ బాస్. ఈ షో కు ఎంత పాపులర్టీ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎక్క‌డో హాలీవుడ్లో ప్రారంభ‌మైనా ఈ రియాలిటీ షో. ప్ర‌స్తుతం మ‌న దేశంలో ప‌లు భాష‌ల్లో న‌డుస్తుందంటే.. ఈ షో కి ఎంత‌టి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. అటు హిందీలో అయితే.. 15 సీజ‌న్ న‌డుస్తుంటే.. తెలుగులో 5 వ సీజ‌న్ స‌క్సెస్ పుల్ గా సాగుతుంది. వినోదాన్ని పంచుతున్న ఈ రియాలిటీ షో లో ఒక సారి పాల్గొంటే.. త‌మ ద‌శ మారుతుంద‌ని భావించేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలా.. బిగ్‌బాస్‌లో పాల్గొని బయటకు వచ్చిన త‌రువాత .. చాలా మందికి సినీ అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. సినిమాల్లో నటించే ఛాన్స్‌లు కూడా కొట్టేశారు.

అలా బిగ్ బాస్ తెలుగు 5 సీజ‌న్ పాల్గొన్న ఇద్ద‌రు కంటెస్టెంట్లు మెగా ఆఫ‌ర్ కొట్టేసిన‌ట్టు వార్తలు వస్తున్నాయి. ఆ ల‌క్కీ ఆఫ‌ర్లు కొట్టేసిన వారేవ్వ‌రో కాదు.. ఒకరు కండ‌ల వీరుడు విశ్వ.. మరొకరు హౌస్ లో పుల్ ఎంట‌ర్ టైన్ చేసిన‌ లోబో. వీరిద్ద‌రికీ ఏకంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌ చరణ్‌, సెన్సెష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీలో న‌టించే అవ‌కాశం కొట్టేసిన‌ట్టు స‌మాచారం. ఇప్పుడూ వీరిద్దరూ రామ్ చ‌ర‌ణ్ తో దిగిన ఫోటోలు నెట్టింట్టో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ విష‌యంలో నిజమెంత ఉందో తెలుసుకోవాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ వార్త వాస్త‌మైతే.. విశ్వ‌, లోబోలు నిజంగా ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన‌ట్టే.

Read more RELATED
Recommended to you

Latest news