బిగ్ బాస్ 6: అర్ధరాత్రి ఆమె దుప్పట్లో అక్కడ చేయి పెట్టిన శ్రీహన్.. కట్ చేస్తే..!

-

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఒకరు ఉన్నట్టుండి గోల చేస్తారు మరొకరు గొడవకు దిగుతారు . ఇంకొన్ని జంటలేమో ప్రేమ అంటూ లవ్ ట్రాక్ ఎక్కే పనిలో ఉన్నాయి. కానీ ఇక్కడ శ్రీహాన్ మాత్రం అర్ధరాత్రి గీతూ దుప్పట్లో దూరి అక్కడ చేయి పెట్టేసారు. అసలు ఏం జరుగుతోంది అనే విషయం ఒకసారి పూర్తిగా చదివి తెలుసుకుందాం.

ఇక అర్ధరాత్రి కూడా పాట కొనసాగే విధంగా సిసింద్రీ టాస్క్ లో మొదటి పోటీదారుడిని ఎంపిక చేసిన తర్వాత విరామం ప్రకటించాడు బిగ్ బాస్. ఇక బుధవారం కంటిన్యూ అవుతుందని కూడా తెలిపాడు. అయితే ఆఖరిలో ట్విస్ట్ ఇస్తూ ప్రతి కంటెస్టెంట్ తమ బొమ్మలను తమ దగ్గర దాచుకోవాలి కూడా తెలిపాడు.. ఇక దీంతో ప్రతి ఒక్కరు కూడా తమ బొమ్మలను కాపాడుకోవడానికి ఎంతగానో వ్యూహాలను సైతం రచించుకుంటున్నారు. బుధవారం జరగనున్న సిసింద్రీ టాస్క్ కు సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ టీం తాజాగా విడుదల చేయగా ఇందులో తెల్లవారుజామున 3 గంటల సమయంలో శ్రీహన్ .. అర్జున్ కళ్యాణ్ బెడ్ దగ్గరికి వెళ్లి అతడి బొమ్మను దొంగతనం చేసి తీసుకొచ్చాడు. వెంటనే డిస్ క్వాలిఫై చేసే ప్రాంతంలో దాని పెట్టాడు.

అర్జున్ బొమ్మను దొంగలించిన తర్వాత చాలామంది కంటెస్టెంట్ దగ్గరకు వెళ్లడం మనం ఈ ప్రోమోలో చూడవచ్చు. ఇక ఈ క్రమంలోని గీతూ రాయల్ పడుకున్న బెడ్ దగ్గరకు వెళ్ళాడు . అంతేకాదు దుప్పట్లో చేయి పెట్టి పైకి లేపాడు. అప్పుడు ఆమె టీ షర్ట్ లో బొమ్మ ఉండడం చూసి భయపడి అక్కడి నుంచి వచ్చేసాడు. ఇక ఇక్కడే ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు కంటెస్టెంట్స్.. అర్జున్ కళ్యాణ్ బొమ్మను దొంగలించి మిగిలిన వాళ్ళని దెబ్బ కొట్టాలని ప్రయత్నించిన శ్రీహన్ తెల్లవారుజామున పడుకున్నాడు. ఇక ఆ సమయంలో గీతూ రాయల్ అతడి బెడ్ దగ్గరికి వెళ్లి బొమ్మను దొంగలించింది వెంటనే దానికి తీసుకొచ్చి డిస్ క్వాలిఫై చేసే ప్రాంతంలో పెట్టేసింది. ఇలా ఒకరికొకరు బొమ్మలను తెలియకుండా మోసం చేసి తీసుకొచ్చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news