బిగ్ బాస్: ఫైమా ఇంకా హౌస్ లో కొనసాగడానికి కారణం అదేనా..?

-

తాజాగా బిగ్ బాస్ ఆరవ సీజన్ చివరి దశకు చేరుకుంది. అయితే హౌస్ లో పరిస్థితులు ఎప్పుడు ఏ విధంగా మారుతాయో చెప్పడం అసాధ్యంగా మారిపోయింది. ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో చాలావరకు ప్రేక్షకుల అంచనాలను తిప్పికొడుతూ తనకు నచ్చిన వారిని బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఎన్నో ఎలిమినేషన్స్ లో బిగ్ బాస్ తనకు ఇష్టం వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో టైటిల్ విన్నర్ అనుకున్న గీతూ.. బాలాదిత్య ఇద్దరు కూడా ఎలిమినేట్ అయ్యి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు .

అందుకు ఉదాహరణ మరొకటి కూడా ఉంది. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో 9 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్లు సేవ్ చేయగా.. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కొంతమందిని సేవ్ చేస్తూ వచ్చాడు బిగ్ బాస్.. చివరిగా 9 మంది మాత్రమే మిగిలారు. మొదట్లో ఎలా అయినా సరే తాను సేవ్ అవుతాను అనుకున్న ఫైమా.. తన దగ్గర ఉన్న ఎఫెక్షన్ ఫ్రీ పాస్ ను రాజ్ కోసం వాడాలని అనుకుంది. అప్పుడు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఫైమాని హెచ్చరిస్తూ ..ఆలోచించుకో ఫైమా.. మీ అమ్మ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకో అంటూ చిన్న హింట్ ఇచ్చాడు.

నాగార్జున మాటలకు భయపడి పోయిన ఫైమా చివరి నిమిషంలో తన దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను తన కోసమే వాడుతున్నట్లు తెలిపింది. అలా చివరి స్థానంలో ఫైమా ఉండేసరికి ఎఫెక్షన్ ఫ్రీ పాస్ తో ఎలిమినేషన్ నుంచి దక్కించుకుంది. కానీ రాజ్ మాత్రం ఎలిమినేట్ అవ్వడం జరిగింది .ఒకవేళ ముందే ఎవిక్షన్ ఫ్రీ పాస్ రాజ్ కోసం ఉపయోగించి ఉంటే తప్పకుండా బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేది. ఏదేమైనా 12వ వారం ఫైమా సేవ్ అవడంతో ఓటింగ్లో చివరి స్థానంలో ఉన్న రాజ్ ను ఎలిమినేట్ చేసి బయటకు పంపించేశాడు బిగ్ బాస్.

Read more RELATED
Recommended to you

Latest news