బిగ్ బాస్: రెమ్యునరేషన్ లో కూడా రాజ్ కు తిప్పలు తప్పలేదా..?

-

బిగ్ బాస్.. ఆరవ సీజన్లో 21 మంది కంటెస్టెంట్లలో ఒకరిగా హౌస్ లోకి అడుగుపెట్టిన రాజశేఖర్.. మొదట్లో పెద్దగా అభిమానులను సొంతం చేసుకో లేకపోయినా ఆ తర్వాత తన ఆటతీరుతో.. మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. మొత్తానికైతే బిగ్ బాస్ 6 ద్వారా రాజశేఖర్ కు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. అంతేకాదు గతంలో అభిమానులు లేక ఓట్లు పడక మొదటి నాలుగు వారాలలో నామినేషన్ లో డేంజర్ జోన్ లో కూడా కనిపించాడు. కానీ మిగతా వాళ్ళు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల రాజశేఖర్ కు కొంతవరకు కలసి వచ్చింది దీంతో సేఫ్ అయ్యాడు.

ముఖ్యంగా రాజశేఖర్ ఎనిమిదో వారంలోనే ఎలిమినేట్ అవుతాడు అని దాదాపు అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి కాస్త తారు మారయ్యింది. మధ్యలో ఒకసారి కెప్టెన్ కూడా అయిన విషయం తెలిసిందే. అయితే ఫిజికల్ టాస్క్ లోనే కాకుండా మైండ్ గేమ్ కూడా చాలా బాగా ప్లాన్ చేసినందుకు హోస్ట్ నాగార్జున కూడా మెచ్చుకున్నాడు. అంతేకాదు గీతూ రాయల్ పై పోరాడిన విధానం కూడా అతనికి ప్లస్ పాయింట్ గా నిలిచింది. గతంలో చేసిన తప్పులను కూడా మెల్లమెల్లగా మార్చుకుంటూ 12వ వారం వరకు చేరుకున్నాడు. అయితే ఎట్టకేలకు ఏవిక్షన్ ఫ్రీ పాస్ కారణంగా ఫైమా సేవ్ అవగా.. ఓట్లు తక్కువ రావడంతో రాజశేఖర్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది.

12 వారాలకు గాను ఎంత పారితోషకం తీసుకున్నాడు అనే వివరాల్లోకెళ్తే.. మొదట అయితే రాజశేఖర్ కు కేవలం మూడు వారాల వరకు ఒక వారానికి రూ. 12,000 మాత్రమే ఇచ్చే విధంగా ఒప్పందం తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఆటలో నిడదొక్కుకోగలిగితే మళ్ళీ బిగ్ బాస్ పారితోషకం పెంచుతానని కూడా చెప్పినట్లు సమాచారం. అలా హౌస్ లో నుంచి వెళ్లిపోయేసరికి రాజశేఖర్ కు వారానికి 20వేల రూపాయల వరకు అందుకున్నాడు. ఇక మొత్తం 12 వారాలకు గాను అతనికి 2లక్షల 40 వేల రూపాయలు వచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news