మీ కొలీగ్స్ తో జాగ్రత్త.. ఈ విషయాలు అస్సలు మాట్లాడవద్దు..

సాధారణంగా ఆఫీసు ప్రదేశాల్లో ఎక్కువ రోజుల నుండి పనిచేస్తున్నప్పుడు కొన్ని ముఖ్య విషయాలను మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ. రోజూ పనిచేసే సహోద్యోగులతో స్నేహం ఎక్కువ పెరిగి, అధిక చనువు ఏర్పడి, అది మిమ్మల్ని తేలికగా తీసుకునే స్థాయికి రావచ్చు. అందువల్ల కొలీగ్స్ తో మాట్లాడే విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

అనవసర పొగడ్తలు

మీ కొలీగ్స్ ని పొగిడేటపుడు నిజంగా అవసరం అనిపిస్తేనే పొగడాలి. వారు వేసుకున్న డ్రెస్, లిప్ స్టిక్ మొదలగు వాటిపై కామెంట్ చేయవద్దు. ఇవన్నీ లైంగిక వేధింపులకు దారి తీసే అవకాశం కూడా ఉంది.

నెగెటివ్ కామెంట్స్

మీరు టీమ్ లీడ్ చేస్తున్నా లేదా సీనియర్ అయినా నెగెటివ్ కామెంట్స్ మానుకోవాలి. మతం, కులం, మహిళలు మొదలగు విషయాల్లో చేసే నెగెటివ్ కామెంట్లు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి లాగవచ్చు.

మీరు ప్రెగ్నెంటా?

అవతలి వారి భౌతికస్థితిని చూసి మీరే ఒక అంచనాకి వచ్చి మీరు గర్భంతో ఉన్నారా వంటి ప్రశ్నలు అస్సలు అడగవద్దు. ఒకవేళ అదే నిజమైతే వారే మీకు చెబుతారు. అంతవరకూ ఆగాలి. ఇలాంటి విషయాల్లో తొందరపాటు అస్సలు వద్దు.

నాకు తెలిసి, కావచ్చు లాంటి పదాలు

మీకు నిజంగా తెలియని విషయాలను చెప్పాల్సి వచ్చినపుడే ఇలాంటి పదాలు ఉపయోగిస్తారు. అవతలి వారి మీద అనవసర అభిప్రాయాలను ఏర్పర్చే ఈ పదాలను ప్రయోగించవద్దు. ఎందుకంటే అక్కడ జరిగిన విషయం నిజమో కాదో తెలియదు. అలాంటప్పుడు మీరే ఏదో ఒకటి చేసి అది నిజమేనని, లేదా అబద్ధమేనని నమ్మవద్దు.

వ్యక్తిగత సంబంధాల విషయాలు

మీ వ్యక్తిగత జీవితం గురించి అస్సలు మాట్లాడవద్దు. మీ ఆఫీసు కాని వారు మీ బయట ఫ్రెండ్స్ తో చెప్పుకోండి తప్ప, ఆఫీసులో డిస్కస్ చేయవద్దు.