చరిత్రలో మొదటిసారి.. వారం మధ్యలో బిగ్ బాస్ ఎలిమినేషన్..!

-

ప్రస్తుతం ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 4 న ప్రారంభమైన బిగ్ బాస్ ఆరవ సీజన్ ఇప్పుడు దాదాపుగా పూర్తి కావస్తోంది. ఇప్పటికే 83 రోజుల 84 వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. టైటిల్ విన్నర్ ను ప్రకటించేందుకు ఇంకో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఇన్ని రోజుల్లో అనూహ్య పరిణామాలు, రొమాన్స్ లు, అరుపులు, గొడవలు, విచిత్ర సంఘటనలు, విభేదాలు, స్నేహం , శత్రుత్వం, ఎమోషన్స్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను బాగానే రక్తి కట్టించాయి. బిగ్ బాస్ సీజన్ సిక్స్ హౌస్ నుంచి ఒక్కొక్కరుగా తమ ఇంటి బాట పట్టారు. ఇప్పుడు 12వ వారం ఎలిమినేషన్ లో భాగంగా రాజశేఖర్ వెళ్ళిపోయాడు. అయితే 12వ వారం మధ్యలో మరో ఎలిమినేషన్ పెట్టి బిగ్ బాస్ టీం షాక్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే చరిత్రలోనే మొదటిసారి ఇలా వారం మధ్యలో బిగ్ బాస్ లో ఎలిమినేషన్స్ పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో 12 వారాలకు గాను 13 మంది ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లారు . ప్రస్తుతం హౌస్ లో 8 మంది మాత్రమే మిగిలారు. తాజాగా జరిగిన 12వ వారం ఎలిమినేషన్ లో ఫైమా వద్ద ఉన్న ఫ్రీ ఎవిక్షన్ పాస్ తో కొద్దిసేపు హైప్ క్రియేట్ చేసి ఆ తర్వాత రాజ్ ను ఎలిమినేట్ చేశారు. దీంతో బిగ్ బాస్ ఆరవ సీజన్ 13 వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది.

నామినేషన్ లో భాగంగా 13వ వారానికి ఇనయ కెప్టెన్ కాగా.. ఎవరు నామినేట్ చేయనందున శ్రీహన్ సేఫ్ అయినట్లు తెలుస్తోంది. అంటే మిగతా ఇంటి సభ్యులైన రేవంత్ ,రోహిత్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీ సత్య, కీర్తి భట్ ఇలా ఈ ఆరుగురు నామినేట్ అయ్యారని సమాచారం. ఇలా ఉండగా ఇప్పటివరకు వీకెండ్స్ లోనే ఎలిమినేషన్ ప్రక్రియ పెడతారన్న విషయం తెలిసిందే. కానీ మంగళవారం ఒక టాస్క్ పెట్టి ఇంటి నుండి ఒక సభ్యుడిని బిగ్ బాస్ టీం ఎలిమినేట్ చేయాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ప్రేక్షకుల ఓటింగ్ బట్టి ఉంటుందా? లేక హౌస్ మేట్స్ ఓటింగ్ ద్వారా ఉంటుందనేది తెలియలేదు. అయితే వారం మధ్యలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news