బిగ్ బాస్ షోలోకి గ్రాండ్ గా గీతూ రీయంట్రీ..నిజమేనా..?

-

ప్రస్తుతం బిగ్ బాస్ ఆరవ సీజన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అందరూ టాప్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా నిలబడుతుంది అని గీతూ రాయల్ గురించి అందరూ చాలా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా పదవ వారం ఆమె ఎలిమినేట్ అయ్యి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందులో కొంతమంది ఇకపై బిగ్ బాస్ ను మనశ్శాంతి గా చూడవచ్చు అని చెబితే మరికొంతమంది లేదు.. గీతూ ఉంటేనే బిగ్ బాస్ అంటూ తెగ కామెంట్లు చేశారు. అయితే గీతూ కూడా బిగ్బాస్ వదిలి వెళ్ళను అంటూ బాగా ఏడ్చేసి, అందరిని ఏడిపించింది. బిగ్ బాస్ స్టేజ్ పై గీతూ ఎమోషనల్ అవుతున్న తీరుని చూసి నాగార్జున సైతం కంటితడి పెట్టాడు. ఎంతసేపటికి ఆమె వెళ్లకపోయేసరికి నాగార్జున సిబ్బందిని పిలిపించి మరి ఆమెను పంపించేశారు.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. గీతూ మళ్లీ బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.. గీతు ఎలిమినేషన్ అనేది నిజానికి బిగ్ బాస్ షో కి పెద్ద మైనస్ అని చెప్పాలి. తాను గేమ్ ఆడుతూ నలుగురితో గేమ్ ఆడించే గీతూ ఎలిమినేట్ కావడంతో హౌస్ లో పోటీ వాతావరణం కనిపించకపోవచ్చు. ఈ క్రమంలోని బిగ్ బాస్ నిర్వహకులు సెకండ్ ఆప్షన్ గా ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో లోపలికి పంపే ఆలోచనలో ఉన్నారట. రెండు మూడు వారాలు హౌస్ మేట్స్ ఆట తీరు, రేటింగ్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోని గీతూ రీ ఎంట్రీ దాదాపు ఖాయమే అని మెజారిటీ ప్రేక్షకులు చెబుతున్నారు. కానీ ఆమె టైటిల్ విన్నర్ కాలేరు. ఒకసారి బయటకు వచ్చి తిరిగి హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ కి అవకాశం ఉండదు. కనీసం టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఫైనల్ వరకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. గతంలో కూడా ఇలాగే జరిగింది.ఒకవేళ షో కి గీతూ వస్తే ఆ కిక్కే వేరంటూ ఆడియన్స్ ముందే ఊహగానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news