బింబిసార – సీతారామం యూఎస్ఏ ప్రీమియర్​ కలెక్షన్స్​ ఎంతంటే?

-

వేసవి సినిమాల సందడి తర్వాత జులై నెల పూర్తిగా నిరాశపరిచింది. గత నెలలో విడుదలైన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుడిని పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో ఆశలన్నీ ఆగస్టుపైనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆగస్టు మొదటి వారంలో(నేడు) ప్రేక్షకులు ముందుకు వచ్చిన కల్యాణ్​రామ్​ ‘బింబిసార’, దుల్కర్​ సల్మాన్​ ‘సీతారామం’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రీమియర్​ షోలకు మంచి రెస్పాన్స్​ వచ్చింది. రెండు కూడా పాజిటివ్​ టాక్​ తెచ్చుకున్నాయి.
ఇక సీతారామం విషయానికొస్తే… మలయాళ స్టార్ దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ‘యుద్ధంతో రాసిన ప్రేమ కథ ఉపశీర్షిక. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. అశ్వినీదత్‌ నిర్మాత. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం కూడా ఫీల్​గుడ్​ మూవీగా ప్రేక్షకుల్ని హత్తుకుంది.అయితే ఈ చిత్ర యూఎస్​ఏ ప్రీమియర్​ కలెక్షన్స్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. దాదాపు 182 లొకేషన్స్​లో విడుదలై ఈ చిత్రం ​ 43 లక్షల 23 వేల వరకు కలెక్ట్ చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news