Twinkle Khanna: వెండితెరపై మూవీగా అక్షయ్ కుమార్ భార్య స్టోరి..దర్శకుడు ఎవరంటే?

-

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ వైఫ్ ట్వింకిల్ ఖన్నా…తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. విక్టరీ వెంకటేశ్ ‘శ్రీను’ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె..ఆ తర్వాత కాలంలో నటిగా సినిమాలు చేయడం ఆపేసింది. రచయిత్రిగా కొనసాగాలని నిర్ణయించుకుని ఆ దిశగా ముందుకు సాగింది రాజేశ్ ఖన్నా కూతురు.

‘మిసెస్ ఫన్నీబోన్స్’గా పేరు సంపాదించుకున్న ట్వింకిల్.. తన కలంతో అత్యద్భుతంగా హాస్యాన్ని పండిస్తోంది. ఆమె రాసిన ఓ షార్ట్ స్టోరీ… ‘సలామ్ నోనీ అప్పా’ కాగా, దీనికి విశేషమైన ఆదరణ లభించింది.

‘ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్’ పేరుతో ట్వింకిల్ ఖన్నా ఓ బుక్ పబ్లిష్ చేసింది. ఆ ఆంథాలజీలోని నాలుగు కథల్లో ఒకటే… ‘సలామ్ నోనీ అప్పా’. ఈ స్టోరిని సినిమాగా చేయబోతున్నారు. అయితే, ఈ పిక్చర్ కు ఇంకా టైటిల్ కన్ఫర్మ్ కానట్లు తెలుస్తోంది. ఈ మూవీకి డైరెక్టర్ సోనల్ దబ్రల్.

ఈ పిక్చర్ ను ట్వింకిల్ ఖన్నా..తన బ్యానర్ ‘మిసెస్ ఫన్నీబోన్స్ మూవీస్’తో పాటు ‘అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఎల్లిప్సిస్ ఎంటర్టైన్మెంట్’ సంయుక్తంగా నిర్మిస్తన్నాయి. ట్వింకిల్ గ్రాండ్ మదర్, ఆమె సిస్టర్ మధ్య రిలేషన్‌కు స్టోరి రూపమే… ‘సలామ్ నోనీ అప్పా’ కాగా, వెండితెరపైన దీనిని ఏ విధంగా ఆవిష్కరిస్తారనేది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిపోయింది. అక్షయ్ కుమార్ ‘ప్యాడ్ మ్యాన్’ సినిమాకూ ట్వింకిల్ ఖన్నా నిర్మాతగా వ్యవహరించింది.

Read more RELATED
Recommended to you

Latest news