రుణాలు తీసుకునే వారికి బ్యాడ్ న్యూస్… ఇక నుండి ఆ ఫెసిలిటీ లేదు..!

-

లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీరు కచ్చితంగా దీనిని తెలుసుకోవాలి. ఇకపై చౌక రుణాలు అందుబాటులో ఉండవని తెలుస్తోంది. దీనికి గల కారణం ఏమిటంటే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచడమే. ఇక మరి దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఆర్‌బీఐ త్వరితగతిన వడ్డీ రేట్లు పెంచొచ్చని అందరు అనుకుంటున్నారు.

వడ్డీ రేట్లను 2020 మే నెల నుంచి ఇప్పటి వరకు మార్చలేదు. ఆర్‌బీఐ ఇటీవల పాలసీ సమీక్షలో కూడా వడ్డీ రేట్లను అలానే ఉంచింది. ఏ మార్పు చెయ్యలేదు. రెపో రేటు పెంపు మాత్రం వచ్చే వచ్చే పాలసీ మీటింగ్‌లో వుండచ్చని అంటున్నారు. కరోనా మహమ్మారి వలన ప్రజలకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందుబాటులో ఉండాలని ఆర్‌బీఐ కీలక పాలసీ రేట్లను అలానే కొనసాగించింది.

ద్రవ్యోల్బణం వలన ఇప్పుడు రెపో రేటు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇది ఎంత ఉండచ్చు అనేది చూస్తే.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను 0.25 శాతం మేర పెంచొచ్చని తెలుస్తోంది. అలానే పాలసీ మీటింగ్స్‌లో కూడా రేట్ల పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. దీనితో 0.5 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. రేట్ల పెంపు జూన్ నుంచి మొదలు కావచ్చు.

ద్రవ్యోల్బణం గురించి చూస్తే.. దేశం లో ద్రవ్యోల్బణం పెరుగుతూనే వస్తోంది. హోల్‌సేల్ ప్రైస్ నాలుగు నెలల గరిష్టాన్ని తాకింది. మార్చి నెలలో 14.55 శాతంగా వుంది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం వరుసగా 12వ నెలలో కూడా డబుల్ డిజిట్‌లోనే ఉంది. మార్చి నెలలో ఇది 7.89 శాతంగా ఉండేది. ఇకపోతే రిటైల్ ద్రవ్యోల్బణం ఈ మార్చి నెలలో 6.95 శాతంగా నమోదు అయ్యింది. మూడో సారి ద్రవ్యోల్బణం 6 శాతం దాటడం.

 

Read more RELATED
Recommended to you

Latest news